News February 9, 2025

UPDATE: HYD: ఆస్తి కోసమే తాత హత్య!

image

ఆస్తి గొడవల కారణంగా వ్యాపారవేత్త జనార్దన్ రావును మనవడు హత్య చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వెల్జాన్ గ్రూప్‌లో ఓ మనవడికి జనార్దన్ డైరెక్టర్ పోస్టును ఇచ్చాడు. తనకు ఏం ఇవ్వలేదని కోపం పెంచుకున్న కీర్తి తేజ తాతపై 73 సార్లు కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా అటాక్ చేసి ఏలూరుకు పారిపోయాడు. పోలీసులు నిందితుడిని ఏలూరులో అరెస్ట్ చేశారు. 

Similar News

News March 12, 2025

గచ్చిబౌలి: రేపు హెచ్‌సీయూలో ప్రత్యేక సదస్సు

image

హెచ్‌సీయూ, ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ విశిష్ట ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రేపు మ.3 గంటలకు HCU క్యాంపస్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆడిటోరియంలో ఈ ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. HCU వీసీ ప్రొ.బీజేరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో ముఖ్యవక్తగా డెన్మార్క్‌లోని ఆర్హస్ యూని వర్సిటీ ప్రొ. సురేశ్ పాల్గొని ప్రసంగిస్తారన్నారు.

News March 12, 2025

ఓయూ: PHD ఎంట్రెన్స్ టెస్ట్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఓయూ కేటగిరి-2 పీహెచ్‌డీ ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఈనెల 11తో గడువు ముగియగా.. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తేదీని రూ.2,000 లేట్ ఫీజుతో ఈనెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు.

News March 12, 2025

HYD: అమ్మా..నాన్నా.. మేం చనిపోతున్నాం! (లెటర్)

image

హబ్సిగూడ‌లో ఆత్మహత్య చేసుకున్న దంపతుల సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ‘అమ్మా.. నాన్న.. మీకు భారంగా ఉండలేక చనిపోతున్నాం. మీరు బాధపడకండి. అన్నా వదిన మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. నా వల్ల ఎప్పుడు మీకు బాధలే. ఏడవకు అమ్మ, నేను నిన్ను వదిలి వెళ్లిపోయా. ఈ బాధ కొద్ది రోజులే, నాకు జీవించాలని అనిపించడం లేదు. నా వరకు ఈ నిర్ణయం కరెక్టే’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

error: Content is protected !!