News January 7, 2026

UPDATE.. NZB: కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డికి బెయిల్

image

ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీగా, కాంగ్రెస్ బాల్కొండ ఇన్‌ఛార్జి సునీల్ రెడ్డిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన రూ.28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేసి, దాన్ని ప్రభుత్వానికి చెల్లించలేదని అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.

Similar News

News April 20, 2026

నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News April 20, 2026

బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

image

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.