News March 4, 2025
UPDATE: NZB: లంచం తీసుకున్న ఇద్దరి అరెస్ట్

ఫిర్యాదుదారుని పేరు మీద ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినందుకు రూ.10 వేలు లంచం తీసుకున్న కేసులో సోమవారం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిజామాబాద్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్-II చెన్న మాధవాణి శ్రీరామ రాజు, కార్యాలయ స్వీపర్ రంగసింగ్ వెంకట్ రావులను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. వారిని హైదరాబాద్లోని ఏసీబీ అదనపు కోర్టులో హాజరు పరచనున్నట్లు వారు వివరించారు.
Similar News
News December 11, 2025
రాత్రికి విశాఖ చేరుకోనున్నమంత్రి లోకేశ్

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం రాత్రి విశాఖ చేరుకోనున్నారు. రాత్రి 9 గంటలకు ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. డిసెంబరు 12న శుక్రవారం మధురవాడ ఐటీ హిల్స్లో పలు ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కాపులుప్పాడలో జరిగే కాగ్నిజెంట్ కంపెనీ భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతారు.
News December 11, 2025
అన్నమయ్య: అందాల పోటీల్లో మెరిసిన షేక్ రీమా.!

అన్నమయ్య జిల్లా T.సుండుపల్లికి చెందిన షేక్ షాహీనా, షేక్ జహుద్ బాషా దంపతుల కుమార్తె ‘షేక్ రీమా’ అందాల పోటీలో అద్భుత ప్రతిభను కనబరింది. జైపూర్లో నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో షేక్ రీమాకు “మిస్ ఈకో ఇంటర్నేషనల్ ఇండియా 2025” కిరీటం దక్కింది. 2026లో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతినిధిగా కూడా ఆమె పాల్గొనబోతున్నారు. మోడలింగ్, క్రీడలు, నృత్యంలో రీమా చూపుతున్న బహుముఖ ప్రతిభ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
News December 11, 2025
ఇంద్రకీలాద్రిపై పూల శోభ.. మైమరిపిస్తున్న అలంకరణ.!

ఇంద్రకీలాద్రిపై భవాని భక్తుల దీక్ష విరమణ మహోత్సవం గురువారం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు పూల అలంకరణతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. అత్యధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న భక్తులను ఈ అలంకరణ ఎంతగానో ఆకర్షిస్తూ, మైమరిపిస్తోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.


