News March 4, 2025

UPDATE: NZB: లంచం తీసుకున్న ఇద్దరి అరెస్ట్

image

ఫిర్యాదుదారుని పేరు మీద ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినందుకు రూ.10 వేలు లంచం తీసుకున్న కేసులో సోమవారం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిజామాబాద్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్-II చెన్న మాధవాణి శ్రీరామ రాజు, కార్యాలయ స్వీపర్ రంగసింగ్ వెంకట్ రావులను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. వారిని హైదరాబాద్‌లోని ఏసీబీ అదనపు కోర్టులో హాజరు పరచనున్నట్లు వారు వివరించారు.

Similar News

News February 23, 2026

కల్తీ నెయ్యి అంశంపై అసెంబ్లీలో చర్చ?

image

AP: రాష్ట్రంలో కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఓ రోజు ఈ అంశంపై చర్చ జరపాలని యోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే అసెంబ్లీ తర్వాత మండలిలోనూ చర్చ పెట్టాలని భావిస్తోందట. ఈ అంశంపై అధికారికంగా తన వైఖరిని వెల్లడించడంతో పాటు అవసరమైన చర్యలపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

News February 23, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ పాల్వంచ: మనస్థాపనతో మహిళ ఆత్మహత్య
✓ దమ్మపేట: రూ.130 లక్షల నగదు, బంగారం లూటీ
✓ భద్రాచలం: గోదావరి వద్ద వైభవంగా నదీ హారతి
✓ పాల్వంచ ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌వో తనిఖీలు
✓ రేపు భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్
✓ పాల్వంచ పెద్దమ్మ తల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు
✓ భద్రాద్రిలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండండి: డీఎఫ్‌వో
✓ ఏప్రిల్‌లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లు: ఇల్లందు ఎమ్మెల్యే

News February 23, 2026

BREAKING: భారత్ ఘోర ఓటమి

image

T20WC సూపర్-8లో అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూర్య సేన 111 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్ 0, అభిషేక్ 15, తిలక్ 1, సూర్య 18, సుందర్ 11, దూబే 42, హార్దిక్ 18, రింకూ 0 పరుగులు చేశారు. SA బౌలర్లలో కేశవ్ 3, మార్కో 4, బోష్ 2, మార్క్రమ్ ఒక వికెట్ తీశారు. ఈ ఓటమితో మిగిలిన రెండు మ్యాచ్‌లనూ భారత్ తప్పక గెలవాల్సిందే.