News January 29, 2025

కారుణ్య నియామకాలపై UPDATE

image

AP: కరోనాతో మరణించిన పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. కారుణ్య నియామకాల ఫైల్‌ను ఆర్థిక శాఖ సీఎం చంద్రబాబు వద్దకు పంపింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 1,488 పోస్టులు భర్తీ కానున్నాయి. కరోనా కారణంగా 2,917 మంది ఉద్యోగులు చనిపోగా, కారుణ్య నియామకాలకు 2,744 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1,488 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించగా, 1,149 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

Similar News

News November 22, 2025

కివీతో ఎన్నో లాభాలు

image

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.

News November 22, 2025

మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

image

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.

News November 22, 2025

సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము

image

AP: విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని తెలిపారు. ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, ఆయన సందేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారన్నారు.