News October 22, 2024
ఉచిత గ్యాస్ సిలిండర్‌పై UPDATE

AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ <<14417031>>సిలిండర్ల <<>>పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రతి 4 నెలల్లో లబ్ధిదారులు ఒక సిలిండర్(ఏడాదికి 3) ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం సిలిండర్ ధర ₹876గా ఉండగా, ఇందులో రాయితీ ₹25 జమ అవుతోంది. మిగతా ₹851ను సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెల 24 నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్‌కు శ్రీకారం చుట్టేలా, దీపావళి నుంచి సరఫరాచేసేలా సమాలోచనలు చేస్తోంది.
Similar News
News December 13, 2025
‘ఓట్ చోరీ’పై రేపు కాంగ్రెస్ సభ

‘ఓట్ చోరీ’ అంశంపై కాంగ్రెస్ పార్టీ రేపు భారీ సభ నిర్వహించనుంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు హాజరుకానున్నారు. ఓట్ చోరీపై ఇప్పటిదాకా 5.5 కోట్ల సంతకాలు సేకరించామని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సభ తర్వాత సంతకాలతో కూడిన మెమొరాండంను సమర్పించేందుకు రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు.
News December 13, 2025
నక్సలిజం పాము లాంటిది: అమిత్ షా

నక్సలిజం ఎవరికీ ప్రయోజనం కలిగించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శాంతి మాత్రమే అభివృద్ధికి మార్గం చూపగలదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ‘నక్సలిజం విషపూరితమైన పాము లాంటిది. దాన్ని అంతం చేసిన తర్వాత అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది’ అని బస్తర్ ఒలింపిక్-2025 ముగింపు కార్యక్రమంలో పేర్కొన్నారు.
News December 13, 2025
AP గోదావరి నీటి మళ్లింపును అనుమతించొద్దు: ఉత్తమ్

TG: గోదావరి నీటి మళ్లింపునకు AP పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ పేరిట చేపట్టే ప్రాజెక్టును అధికారులు ఇవాల్యుయేషన్ చేయకుండా నిలువరించాలని కేంద్రం, CWCలను TG కోరింది. అలాగే కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు చర్యలనూ అడ్డుకోవాలంది. వీటిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్, TGకి కృష్ణా నీటి కేటాయింపు తదితరాలపై సహకారాన్ని అభ్యర్థించారు.


