News October 31, 2024
నవంబర్ 9న ‘గేమ్ ఛేంజర్’ టీజర్
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 9న ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తామని రైలు పట్టాలపై రామ్‌చరణ్ చొక్కా లేకుండా కూర్చున్న ఫొటోను పంచుకుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
Similar News
News October 31, 2024
ధనత్రయోదశి: ఫస్ట్ టైమ్ బంగారాన్ని ఓడించిన వెండి
భారత నగల మార్కెట్ చరిత్రలో తొలిసారి వెండి అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ధనత్రయోదశి వేళ కస్టమర్లు బంగారం కన్నా దీనినే ఎక్కువ కొనుగోలు చేశారు. ‘గత సీజన్‌తో పోలిస్తే సిల్వర్ రేట్ 40% పెరిగినా అమ్మకాలు 30-35% ఎగిశాయి. ఇలాంటి డిమాండ్ మునుపెన్నడూ చూడలేదు. వ్యాపార ప్రయోజనం వల్ల సిల్వర్‌పై పెట్టుబడి ఓ మంచి అవకాశంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’ అని IBJA జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా తెలిపారు.
News October 31, 2024
LSG రిటెన్షన్ లిస్టు
IPL-2025 కోసం తాము రిటెన్షన్ చేసుకున్న జట్టును LSG ప్రకటించింది. ఇప్పటివరకు ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌ను వదులుకుంది. నికోలస్ పూరన్‌ను అత్యధికంగా రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది. రవి బిష్ణోయ్(రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్(రూ.11 కోట్లు), మోసిన్ ఖాన్(రూ.4 కోట్లు), ఆయుష్ బదోనీ(రూ.4కోట్లు) LSG రిటైన్ చేసుకుంది.
News October 31, 2024
కోల్‌కతా నైట్‌రైడర్స్ రిటెన్షన్ ప్లేయర్లు వీరే..
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరుగురు ప్లేయర్లను రిటెన్షన్ చేసుకుంది. రింకూ సింగ్ రూ.13 కోట్లు, వరుణ్ చక్రవర్తి రూ.12 కోట్లు, సునీల్ నరైన్ రూ.12 కోట్లు, రస్సెల్ రూ.12 కోట్లకు రిటైన్ చేసుకుంది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లలో హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్‌కు రూ.4కోట్లు వెచ్చించింది.