News February 7, 2025
గ్రూప్-1 ఫలితాలపై UPDATE

TG: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ముగిసింది. మరో 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు TGPSC కసరత్తు చేస్తోంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ఉండనుంది. ఈ పరీక్షలకు 21,093 మంది హాజరైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్-2, 3 ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. బ్యాక్‌లాగ్‌లు లేకుండా ఉండేందుకు ఇలా చర్యలు తీసుకుంటోంది.
Similar News
News December 7, 2025
ఇండిగోకి DGCA షోకాజ్ నోటీసులు

ఇండిగో సర్వీసుల్లో ఏర్పడిన గందరగోళంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ CEO పీటర్ ఎల్బర్స్, మేనేజర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సమాధానమివ్వాలని పేర్కొంది. లార్జ్ స్కేల్ క్యాన్సిలేషన్స్, ప్లానింగ్‌లో వైఫల్యం, నిర్లక్ష్యం వంటి అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది. ఈ విషయంలో ఇండిగో సంస్థపై కఠిన చర్యలు ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
News December 7, 2025
37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగవ్వాలి: చంద్రబాబు

AP: ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ మీటింగ్‌లతో వారి పనితీరు మెరుగుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరి పనితీరుపైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కేడర్‌ను సిద్ధం చేసుకోవాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు.
News December 7, 2025
నిద్రలో నోటి నుంచి లాలాజలం కారుతోందా?

కొంతమందికి నిద్రలో నోటి నుంచి లాలాజలం కారుతుంటుంది. అయితే ఇది సాధారణం కాదంటున్నారు వైద్యులు. నిద్రలో నోటి నుంచి లాలాజలం కారడం కొన్ని వ్యాధులకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. సైనస్ ఇన్ఫెక్షన్, నిద్ర, నాడీ, గ్యాస్ట్రో సంబంధిత, దంతాలు లేదా చిగుళ్లలో సమస్యలకు సంకేతమని పేర్కొంటున్నారు. ఈ సమస్య రోజురోజుకీ తీవ్రమైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


