News July 10, 2024
రూ.2,00,000 రుణమాఫీపై అప్‌డేట్

TG: రైతులకు రుణమాఫీని వచ్చే వారం నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం గైడ్‌లైన్స్ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ఈ ఫైల్‌కు సీఎం రేవంత్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఆమోదముద్ర పడుతుందని సమాచారం. దాదాపు ₹31 వేల కోట్ల పంట రుణాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 15లోగా ఒక్కో రైతుకు ₹2లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 11, 2026
ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

AP: క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును జూన్ వరకు పొడిగించింది. భూముల బదిలీకి సంబంధించి చట్టసవరణకు ముసాయిదా బిల్లు, ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభం సహా మొత్తం 24 అంశాలకు ఆమోదం తెలిపింది. ఆగిరిపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్‌కు 45.6 ఎకరాలు, సంజామలలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు 1500 ఎకరాలు, ఆనందపురంలో 18.57 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది.
News February 11, 2026
AIకి ప్రిపేర్ అవ్వకపోతే వెళ్లిపోవచ్చన్న గూగుల్

కంపెనీ AI ప్రణాళికలకు సిద్ధంగా లేని ఉద్యోగులు స్వచ్ఛందంగా విరమణ తీసుకోవచ్చని గూగుల్ పేర్కొంది. వారికోసం ఓ ప్యాకేజీని సైతం తీసుకొచ్చింది. USలో పనిచేసే గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్(GBO)లోని కొందరు ఉద్యోగులకు ఈ ప్యాకేజీ వర్తించనుంది. GBO అనేది గూగుల్ సంస్థ ఉత్పత్తులు, గ్లోబల్ రెవెన్యూ గ్రోత్ తదితరాలను పర్యవేక్షిస్తుంటుంది. అటు అమెజాన్, మెటా తదితర టెక్ కంపెనీలు ఇలాంటి ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి.
News February 11, 2026
సంక్రాంతి బరిలో మరో హీరో?

చాన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ వచ్చే సంక్రాంతికి అదృష్టం పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. ‘ఆయ్’ ఫేమ్ అంజి డైరెక్షన్‌లో మూవీని ఓకే చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. టైటిల్‌తోనే పండుగ వైబ్ వచ్చేలా ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అనే పేరును లాక్ చేసినట్లు చర్చించుకుంటున్నాయి. అటు చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌తో పాటు శర్వానంద్, తేజా సజ్జ మూవీలు సంక్రాంతికి రిలీజ్ అవుతాయని టీటౌన్ వర్గాల మాట.


