News March 13, 2025
కొత్త రేషన్ కార్డులపై UPDATE

TG: రేషన్ కార్డులను క్యూ ఆర్ కోడ్‌తో ఏటీఎం కార్డు సైజులో జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త వాటితో పాటు పాత వాటికి Qr కోడ్ ఇవ్వనుంది. 1.20 కోట్ల కొత్త కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. 760 మైక్రాన్స్ మందం, 85.4mm పొడవు, 54mm వెడల్పు ఉండే ఈ కార్డులపై నంబర్, కుటుంబ పెద్ద పేరు, ఫొటో, ఇతర వివరాలు ఉంటాయి. నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు.
Similar News
News March 13, 2025
వైకుంఠపురం డీపీఆర్ రూపొందిస్తున్నాం: మంత్రి

AP: వైకుంఠపురం బ్యారేజ్ పునర్నిర్మాణానికి డీపీఆర్ తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 15లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉండేదని, కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని అసహనం వ్యక్తం చేశారు.
News March 13, 2025
జర్నలిస్టుల అరెస్ట్‌పై కపిల్ సిబల్ అసహనం.. పూనమ్ రిప్లై!

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను పోస్ట్ చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తప్పుబట్టారు. ఇలా అరెస్టులు చేయడం పరిష్కారం కాదని, ఇది అంటువ్యాధిలాంటిదని మండిపడ్డారు. ఈ చర్యపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌కు సినీ నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. ‘ఆమె ఇతర మహిళలకు పరువు నష్టం కలిగించడమే అజెండాగా పనిచేస్తుంది. నేనూ ఆమె బాధితురాలినే’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్: హరీశ్

TG: CM రేవంత్ అసెంబ్లీలో, బయటా అసత్యాలే మాట్లాడుతున్నారని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని హరీశ్ రావు విమర్శించారు. TVVP డాక్టర్లు, నర్సులు, హోం గార్డులు సహా ఇతర సిబ్బందికి వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ’13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని TVVP సిబ్బందికి జీతాలు చెల్లించలేదు. పోలీసు శాఖలోనూ ఇదే దుస్థితి. దుష్ప్రచారంతో ఇంకెంత కాలం వెళ్లదీస్తారు?’ అని ప్రశ్నించారు.