News April 9, 2025
ఈరోజు ఎన్టీఆర్-నీల్ మూవీపై అప్డేట్

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలు తీసిన నీల్ తమ హీరోను ఎలా చూపిస్తారా అని తారక్ ఫ్యాన్స్ ఇంట్రస్టింగ్గా ఎదురుచూస్తున్నారు. వారికి మూవీ సర్ప్రైజ్ న్యూస్ చెప్పింది. ఈరోజు మధ్యాహ్నం 12.06 గంటలకు సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ అప్డేట్ ఏంటా అన్న ఆసక్తి నెలకొంది.
Similar News
News April 17, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు అల్లూరి జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో రేపు తీవ్రమైన వడగాలులు వీచే ప్రభావం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News April 17, 2025
డ్రగ్స్ ఆరోపణలు.. స్పందించిన ప్రముఖ నిర్మాత

బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహర్ ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. డ్రగ్స్ వాడకం వల్లే అలా అయ్యారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కరణ్ ఇన్స్టాగ్రామ్లో స్పందించారు. ‘నాకేం కాలేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా బ్లడ్ లెవెల్స్ సరిగ్గా మెయింటేన్ చేయాలని డాక్టర్స్ సూచించారు. రోజుకు ఒక పూటే తింటున్నాను. కఠిన డైట్ వల్ల సన్నగా మారాను’ అని వివరించారు.
News April 17, 2025
ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్కు.. సీఎం జపాన్ పర్యటనలో ఒప్పందం

TG: ఫ్యూచర్ సిటీలో వెయ్యి ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మారుబెనీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. CM రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన సందర్భంగా ఈ డీల్ కుదిరింది. రూ.వెయ్యి కోట్లతో పార్క్ను అభివృద్ధి చేయనుండగా, రూ.5వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. సుమారు 30వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. మరోవైపు సోనీ ప్రధాన కార్యాలయాన్ని సీఎం రేవంత్ సందర్శించారు.