News December 16, 2024

ప్రభాస్ గాయంపై అప్డేట్!

image

రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఓ సినిమా షూటింగ్‌లో గాయం అయిన విషయం తెలిసిందే. తాజాగా గాయంపై సినీవర్గాలు అప్డేట్ ఇచ్చాయి. ‘ప్ర‌భాస్ గాయం పెద్ద ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది కాదు. ఆయ‌న ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. రాజాసాబ్ మెయిన్ షూట్ పూర్త‌వడంతో ఆ సినిమాకు ఇబ్బంది లేదు. ఫౌజీ షూటింగ్‌కు మాత్ర‌మే బ్రేక్‌. అతి త్వ‌రలోనే ఆయ‌న మ‌ళ్లీ షూటింగ్స్‌లో పాల్గొంటారు’ అని పేర్కొన్నాయి.

Similar News

News November 16, 2025

నేడు నాన్ వెజ్ తినవచ్చా?

image

కార్తీక మాసంలో రేపు(చివరి సోమవారం) శివాలయాలకు వెళ్లేవారు, దీపారాధన, దీపదానం చేయువారు నేడు నాన్ వెజ్ తినకూడదని పండితులు సూచిస్తున్నారు. అది కడుపులోనే ఉండి రేపటి పూజకు అవసరమైన శరీర పవిత్రతను దెబ్బ తీస్తుందని అంటున్నారు. ‘మాంసాహారం రజోతమో గుణాలను ప్రేరేపించి, దైవారాధనలో ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి శివానుగ్రహాన్ని పొందడానికి, పూజ ఫలం కలగడానికి నేడు సాత్విక ఆహారం స్వీకరించడం ఉత్తమం’ అంటున్నారు.

News November 16, 2025

జుట్టు పొడిబారకుండా ఉండాలంటే?

image

పొడిబారి ఉన్న కురులకు గాఢత తక్కువగా, తేమను పెంచే షాంపూలను ఎంచుకోవాలి. పొడి జుట్టు ఉన్నవారు సల్ఫేట్‌ ఫ్రీ ఫార్ములాతో ఉన్న మాయిశ్చరైజింగ్‌ షాంపూలను ఎంచుకోవాలి. తేమను నిలిపే హైలురోనిక్‌ యాసిడ్, స్క్వాలేన్‌ వంటివి ఉండేలా చూసుకోవాలి. తలస్నానం చేశాక కండిషనర్‌ తప్పనిసరిగా రాసుకోవాలి. అయినా సమస్య తగ్గకపోతే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించి పోషకాల లేమి ఏమైనా ఉంటే… సప్లిమెంట్స్‌ వాడాల్సి ఉంటుంది.

News November 16, 2025

రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా తెలుగు వ్యక్తి

image

రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు IAS ఆఫీసర్ వోరుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న ఈయనను RJ ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రప్పించి సీఎస్ బాధ్యతలు అప్పగించింది. ఈయన 1966లో అరకు లోయలో జన్మించారు. భద్రాచలం, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. 1989లో ఎంటెక్ పూర్తయ్యాక IASకు ఎంపికయ్యారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలిని శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు.