News July 14, 2024
రామ్చరణ్- బుచ్చిబాబు కాంబో మూవీపై అప్డేట్

రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో రూపొందనున్న చిత్రంపై మైత్రీ మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చింది. చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్, ఛాయాగ్రాహకుడు రత్నవేలుతో కలిసి దిగిన ఫొటోను బుచ్చిబాబు Xలో షేర్ చేశారు. దీనిపై నిర్మాణ సంస్థ స్పందిస్తూ ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు టెక్నికల్ టీమ్ పనిలో నిమగ్నమైందని తెలిపింది. దుబాయ్లోని ఫిర్దౌజ్ స్టూడియోలో వర్క్ జరుగుతున్నట్లు పేర్కొంది.
Similar News
News December 6, 2025
బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.
News December 6, 2025
హనుమాన్ చాలీసా భావం – 30

సాధు సంత కే తుమ రఖవారే|
అసుర నికందన రామ దులారే||
ఆంజనేయుడు సాధువులకు, సత్పురుషులకు, మంచివారికి ఎప్పుడూ రక్షకుడిగా ఉంటాడు. ఆయన రాక్షసుల సమూహాన్ని నాశనం చేసి, లోకానికి శాంతిని కలిగిస్తాడు. శ్రీరాముడికి చాలా ప్రియమైనవాడు. ఈ గుణాల కారణంగానే హనుమంతుడు అపారమైన శక్తితో, భక్తితో ఈ ప్రపంచంలో అందరిచేత పూజలందుకుంటున్నాడు. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 6, 2025
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులకు అప్లై చేశారా?

ముంబైలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 20 ఆక్చువేరియల్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు IAI/IFoA నిర్వహించే పరీక్షలో కనీసం 2 యాక్చురియల్ సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి. 21 నుంచి 27ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.40వేలు స్టైపెండ్ చెల్లిస్తారు.


