News December 31, 2024
మన్మోహన్ స్మారకం నిర్మాణంపై అప్డేట్

ఢిల్లీలో మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణానికి స్థలం లభ్యతపై CPWD అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. స్మారకం నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేయాల్సి ఉంది. ట్రస్టుకు కేంద్రం భూమి అప్పగిస్తుంది. అనంతరం School of Planning & Architecture ఇచ్చే డిజైన్ ఆధారంగా స్మారకం నిర్మించాలి. ట్రస్టు నిధులు బదిలీ చేస్తే CPWD నిర్మిస్తుంది. వాజ్పేయి స్మారకం నిర్మాణంలో ఇదే విధానాన్ని అనుసరించారు.
Similar News
News January 1, 2026
ఈ దశలో మామిడికి తప్పక నీరు అందించాలి

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రకాల మామిడి చెట్లలో ఇప్పటికే పూమొగ్గలు కనిపిస్తున్నాయి. ఇలా పూమొగ్గలు ఏర్పడి, అవి పెరుగుదల దశలో ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడి ఇవ్వాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పిందె ఏర్పడిన తర్వాత (బఠాణి గింజ సైజులో ఉన్నప్పుడు), ప్రతి 15-20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలని చెబుతున్నారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి వ్యవసాయ నిపుణుల సూచనలు తీసుకోవాలి.
News January 1, 2026
న్యూ ఇయర్ రోజున ఈ పనులు వద్దు: పండితులు

కొత్త ఏడాది మొదటి రోజున మనం చేసే పనులు ఆ ఏడాదంతా మనపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఇంట్లో గొడవలు, వాదనలకు దూరంగా ఉండాలని, అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదని సూచిస్తున్నారు. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని అంటున్నారు. ‘నలుపు దుస్తులు వద్దు. ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది. ఏడిచినా, విచారంగా ఉన్నా ఏడాదంతా అదే కొనసాగుతుంది’ అంటున్నారు.
News January 1, 2026
BEL 51పోస్టులకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


