News August 18, 2024
రజనీ ‘వెట్టయాన్’ నుంచి రేపు అప్డేట్

రజనీకాంత్ హీరోగా జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న వెట్టయాన్ మూవీ నుంచి రేపు ఉదయం 10 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సూపర్ స్టార్ పాత్ర షూటింగ్ ఇప్పటికే ముగియడంతో రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజూ వారియర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News November 13, 2025
రబీలో మొక్కజొన్న సాగు చేస్తున్నారా?

రబీలో మొక్కజొన్నను నవంబరు 15లోగా విత్తుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. దీని కోసం ఎకరాకు 8 కిలోల విత్తనం అవసరం. ఒక కిలో విత్తనానికి 6ml నయాంట్రానిలిప్రోల్ + థయోమిథాక్సామ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. దుక్కి చేసిన నేలలో 60 సెం.మీ. ఎడం ఉండునట్లు బోదెలు చేసుకోవాలి. విత్తనాన్ని మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీటి తడిని అందించాలి.
News November 13, 2025
రూ.30 కోట్లతో మినీ వేలంలోకి CSK?

IPL-2026 మినీ వేలానికి ముందు CSK రిటెన్షన్స్‌పై మరికొన్ని అప్‌డేట్స్ బయటికొచ్చాయి. రచిన్ రవీంద్ర, కాన్వేతో పాటు చాలా మంది స్వదేశీ ప్లేయర్లను రిలీజ్ చేయాలని ఆ టీమ్ నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఫారిన్ ప్లేయర్లు మతీశా పతిరణ, నాథన్ ఎల్లిస్‌ను రిటైన్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. దాదాపు రూ.30 కోట్ల పర్స్‌తో CSK వేలంలో పాల్గొననున్నట్లు సమాచారం.
News November 13, 2025
వరల్డ్ లాంగెస్ట్ మ్యారీడ్ కపుల్ వీరే..

అత్యధిక కాలంగా దాంపత్య జీవితం సాగిస్తున్న జంటగా అమెరికాకు చెందిన ఎలీనర్(107), లైల్ గిట్టెన్స్(108) ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 1942లో వీరికి వివాహం కాగా 83ఏళ్లుగా అన్యోన్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే ఓల్డెస్ట్ లివింగ్ కపుల్‌గానూ ఖ్యాతి గడించారు. వీరి కంటే ముందు బ్రెజిల్ జంట మనోయల్, మరియా అత్యధిక కాలం(85ఏళ్లు) వైవాహిక జీవితం గడిపిన కపుల్‌గా రికార్డుల్లోకెక్కారు.


