News November 7, 2024
‘పుష్ప2’ ఐటమ్ సాంగ్, ట్రైలర్‌పై అప్డేట్స్

ఎన్నో అంచనాల నడుమ అల్లు అర్జున్ ‘పుష్ప2’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ప్యాచ్‌వర్క్ షూట్ నిన్న ముగిసింది. కాగా శ్రీలీలతో ఐటెమ్ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. నవంబర్ 12 లేదా 13 నాటికి షూటింగ్ మొత్తం ముగియనుందని సమాచారం. కాగా ఈ మూవీ ట్రైలర్ 3 నిమిషాల 45 సెకన్లకు లాక్ చేసినట్లు టాక్. NOV 15న ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. DEC 5న మూవీ విడుదలవనుంది.
Similar News
News December 12, 2025
ఒకే జిల్లాలో 7,400 HIV కేసులు

బిహార్‌లోని సీతామఢీ జిల్లాలో ఏకంగా 7,400 HIV కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 400 మంది చిన్నారులున్నారు. వీరికి తల్లిదండ్రుల ద్వారా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ జిల్లాలో ప్రతి నెలా 40-60 దాకా కేసులు నమోదవుతున్నాయని, ప్రస్తుతం 5వేల మందికి పైగా వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సరైన అవగాహన, టెస్టింగ్ లేకపోతే వ్యాధి మరింత వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News December 12, 2025
నైనిటాల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు

<
News December 12, 2025
నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

దుబాయ్ వేదికగా నేటి నుంచి U-19 వన్డే ఆసియా కప్ జరగనుంది. గ్రూప్Aలో భారత్, పాక్, UAE, మలేసియా, గ్రూప్Bలో అఫ్గాన్, బంగ్లా, నేపాల్, శ్రీలంక తలపడనున్నాయి. ఇవాళ తొలి మ్యాచ్‌లో UAEతో భారత్ పోటీ పడనుంది. కెప్టెన్ ఆయుశ్, వైభవ్, విహాన్, వేదాంత్, దీపేశ్, కిషన్ లాంటి ప్లేయర్లతో యంగ్ ఇండియా బలంగా ఉంది. మ్యాచ్‌లన్నీ 10.30AM నుంచి ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ లివ్ యాప్‌లో వీక్షించవచ్చు.


