News September 7, 2025

ఈ నెల 15 నుంచి UPI లిమిట్ పెంపు.. రోజుకు ఎంతంటే?

image

ఈ నెల 15 నుంచి కొన్ని ప్రత్యేకమైన పేమెంట్స్‌(P2M)కు UPI లిమిట్‌ను రోజుకు రూ.10 లక్షలకు పెంచుతూ NPCI నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు రూ.లక్ష మాత్రమే UPI ద్వారా పంపొచ్చు. ఇన్సూరెన్స్, పన్నులు, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవాళ్లకు ఇది ఇబ్బందిగా మారడంతో ఒక్కసారి రూ.5 లక్షలు, రోజుకు రూ.10 లక్షలు పంపుకునే వెసులుబాటు కల్పించింది. కాగా మనం (P2P) స్నేహితులు, బంధువులకు పంపే లిమిట్ మాత్రం రూ.లక్షగానే ఉంది.

Similar News

News September 7, 2025

బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే..

image

నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్-9 మొదలైంది. తొలి కంటెస్టెంట్‌గా తనూజ(ముద్దమందారం) హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఆశా/ఫ్లోరా సైనీ(సినీ నటి), కమెడియన్ ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ, సామాన్యుల కోటాలో పడాల పవన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్‌లో రెండు హౌస్‌లు ఉంటాయని నాగార్జున తెలిపారు. సామాన్యులుvsసెలబ్రిటీలుగా షో సాగే అవకాశం ఉంది. ఈ సారి 15 మందికిపైగా కంటెస్టెంట్లు ఉండనున్నట్లు సమాచారం.

News September 7, 2025

మరికాసేపట్లో చంద్రగ్రహణం

image

ఇవాళ రాత్రి 8.58 గంటలకు చంద్రగ్రహణం మొదలు కానుంది. 11గంటల నుంచి అర్ధరాత్రి 12.22గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటల వరకు ఇది కొనసాగనుంది. ఈ గ్రహణాన్ని ఎలాంటి పరికరం లేకుండా నేరుగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణం సమయంలో ధ్యానం, జపం చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News September 7, 2025

ఇంగ్లండ్ భారీ స్కోర్.. ఇద్దరు సెంచరీలు

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. రూట్(100), బెతెల్(110) సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 414 పరుగులు చేసింది. మరో ఇద్దరు బ్యాటర్లు 50+ స్కోర్లు చేశారు. బట్లర్ 32 బంతుల్లోనే 8 ఫోర్లు, ఓ సిక్సుతో 62* రన్స్ బాదారు. మెన్స్ వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ 7సార్లు 400+ స్కోర్ చేసింది. ఈ లిస్టులో సౌతాఫ్రికా(8) టాప్‌లో ఉంది.