News January 8, 2025
UPI మార్కెట్ షేర్ ఇలా!
ఎక్కడికెళ్లినా మనీకి బదులుగా UPIని వినియోగించడం పెరిగిపోయింది. దీంతో మార్కెట్లో చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా ప్రతిచోట డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. అయితే, ప్రజలు అత్యధికంగా PhonePay వాడుతున్నట్లు తేలింది. డిసెంబర్-2024 UPI మార్కెట్ షేర్ ప్రకారం PhonePayని 47.7%, GooglePayని 36.7%, Paytmని 6.87% మంది వాడుతున్నారు. ఇంతకీ మీరు ఎక్కువగా ఏ పేమెంట్ యాప్ వాడుతారో కామెంట్ చేయండి.
Similar News
News January 9, 2025
అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా: KTR
TG: ఫార్ములా-ఈ రేసింగ్ కేసు విచారణలో భాగంగా ఏసీబీకి సహకరించినట్లు మాజీ మంత్రి కేటీఆర్ విచారణ అనంతరం వెల్లడించారు. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. మళ్లీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ఇది లొట్టపీసు కేసు అని, ఎలాంటి అవినీతి లేదని KTR మరోసారి ఉద్ఘాటించారు.
News January 9, 2025
ముగిసిన కేటీఆర్ విచారణ
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి KTRపై ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. అనుమతులు, నిధుల బదీలీ వంటి అంశాలపై ఆయన్ను అధికారులు సుమారుగా 7 గంటల పాటు ప్రశ్నించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్, ఏసీపీ, సీఐ ఈ విచారణలో పాల్గొన్నారు. కేటీఆర్ తరఫు న్యాయవాదిని పక్క గది వరకు అనుమతించారు.
News January 9, 2025
ఇందిరమ్మ ఇళ్లపై BIG UPDATE
TG: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రీవెన్స్ మాడ్యూల్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో ప్రారంభించారు. ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే <