News August 9, 2024
రేపు UPI పేమెంట్స్ పని చేయవు: HDFC

అత్యవసర సర్వీస్ మెయింటెనెన్స్ నిమిత్తం తన వినియోగదారులకు రేపు(ఆగస్టు 10) తెల్లవారుజామున 2.30గంటల నుంచి 5.30 మధ్య 3గంటల పాటు UPI సేవలు నిలిచిపోతాయని HDFC ప్రకటించింది. ఆ సమయంలో గూగుల్ పే, వాట్సాప్ పే, పేటీఎం, HDFC యాప్, Mobikwik, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సర్వీసులు పని చేయవని తెలిపింది. ఈ మేరకు తన వినియోగదారులకు ఈమెయిల్స్ పంపించింది.
Similar News
News November 25, 2025
ఇక పోలీసుల గుప్పిట్లో కర్రె గుట్టలు..!

తెలంగాణ-ఛత్తీస్గఢ్ను వేరు చేస్తూ ఇప్పటి వరకు మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న కర్రెగుట్టలు పోలీసులకు అడ్డాగా మారనున్నాయి. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ మనుగడ సాగించలేని పరిస్థితికి చేరుకుంది. రెండు రాష్ట్రాల పోలీసులు ఇప్పటికే కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తాజాగా ఏర్పాటైన బేస్ క్యాంపుతో ఒకప్పటి మావోయిస్టుల స్థావరం పోలీసుల వశమైంది. త్వరలో గుట్టపైన క్యాంపులు ఏర్పాటు కానున్నాయి.
News November 25, 2025
ICAR-IIMRలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

HYDలోని ICAR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్లో 5 సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc(జెనిటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, లైఫ్ సైన్స్, ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ ), PhD, PG( అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) ఉత్తీర్ణతతో పాటు NET అర్హత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://www.millets.res.in/
News November 25, 2025
రాములోరి జెండా ప్రత్యేకతలివే..

జెండాపై రాముడి సూర్యవంశం సూచించేలా భానుడు, విశ్వంలో సంపూర్ణ పవిత్ర శబ్దం ఓం, కోవిదారు వృక్ష చిహ్నాలున్నాయి. మందార, పారిజాత వృక్షాల అంటుకట్టుతో కశ్యప రుషి ఈ చెట్టును సృష్టించారని పురాణాలు తెలిపాయి. భరతుడి రథ ధ్వజంలోని జెండాలో గల ఈ చిహ్నం గురించి రఘువంశంలో కాళిదాసు ప్రస్తావించారు. ఈ జెండాను లక్ష్మణుడు దూరం నుంచే చూసి ‘సీతారాములను అయోధ్యకు తీసుకెళ్లేందుకు భరతుడు వస్తున్నాడ’ని అన్నకు సమాచారమిచ్చారు.


