News September 28, 2024
పాత పేమెంట్ సిస్టమ్స్‌కు పాతరేస్తున్న UPI: జేపీ మోర్గాన్

భారత్ సహా ఆసియాలోని చాలా దేశాలు ACH వంటి పాత పేమెంట్ మెథడ్స్‌కు ముగింపు పలుకుతున్నాయని JP MORGAN ఎగ్జిక్యూటివ్ మ్యాక్స్ న్యూకిర్చెన్ అన్నారు. UPI వంటి రియల్‌టైమ్ పేమెంట్ సిస్టమ్స్ మూమెంటమ్ బాగా పెరిగిందన్నారు. ఈ పాపులారిటీ హెల్త్‌కేర్ సహా అన్ని రంగాల్లో UPIని వాడేలా పుష్ చేస్తోందన్నారు. అందుకే క్లైంట్లకు నేరుగా సేవలు అందించేందుకు ONDCతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు.
Similar News
News December 7, 2025
కొత్తగూడెం: వామ్మో.. రూ.12.35 లక్షల కరెంటు బిల్లు హా

ప్రతినెల వేలల్లో వచ్చే కరెంటు బిల్లు ఒక్కసారిగా రూ.12,35,191 రావడంతో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌కు చెందిన షాపు నిర్వాహకుడు అశోక్ ఆందోళనకు గురయ్యారు. గత నెలలో రూ.40,063 ఉన్న బిల్లు ఈ నెలలో లక్షల్లో చేరడాన్ని చూసి అవాక్కయ్యారు. అధికారుల తప్పిదం వల్లే ఇలా జరిగిందని, సరిచేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News December 7, 2025
నావల్ డాక్‌యార్డ్‌లో 320 పోస్టులు

విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ 320 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు జనవరి 2వరకు అప్లై చేసుకోవచ్చు. NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/
News December 7, 2025
మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

☛ మొక్కజొన్న (సంకర రకాలు)- 90% ☛ శనగ- 85% ☛ వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)- 80% ☛ జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద – 75% ☛ ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు – 70% ☛ పత్తి, బెండ, కాలిఫ్లవర్ – 65% ☛ మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర- 60%. 100 విత్తనాలకు పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.


