News January 1, 2025
డిసెంబర్లో రికార్డు స్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్లు
దేశంలో గత నెల(డిసెంబర్-24)లో రికార్డు స్థాయిలో రూ.23.25 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2016లో ఏప్రిల్లో చెల్లింపులు ప్రారంభమైన తర్వాత నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. నవంబర్లో రూ.21.55 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరగగా డిసెంబర్లో 8శాతం పెరిగాయి. ఇక 2023తో పోలిస్తే 2024లో యూపీఐ ట్రాన్సాక్షన్లు 46శాతం పెరిగినట్లు ఎన్సీపీఐ పేర్కొంది.
Similar News
News January 4, 2025
వీసా లేకుండా ఈ దేశాలకు వెళ్లొచ్చు
భారత టూరిస్టులను అట్రాక్ట్ చేసేందుకు కొన్ని దేశాలు వీసా లేకుండానే ప్రవేశించేలా సడలింపులు తీసుకొచ్చాయి. అందులో థాయ్లాండ్, మలేషియా, మారిషస్, జమైకా, మాల్దీవ్స్, కెన్యా, మకావు, బార్బడోస్, కజకిస్థాన్, గాంబియా, నేపాల్, ఎల్ సాల్వడార్, భూటాన్, హైతీ, సీషెల్స్, సెనెగల్, గ్రెనడా, అంగోలా, డొమినికా, మోంట్సెరాట్, సెయింట్ కిట్స్ & నెవిస్, మైక్రోనేషియా, ట్రినిడాడ్ & టబాగో ఉన్నాయి. మీరెక్కడికైనా వెళ్తున్నారా?
News January 4, 2025
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం
AP: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ పథకాన్ని మంత్రి నారా లోకేశ్ విజయవాడ జిల్లా పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.27.39 కోట్లు ఖర్చు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేసేందుకు రూ.85.84కోట్లు కేటాయించింది.
News January 4, 2025
ఫ్యాన్స్కు ‘డాకు మహారాజ్’ నిర్మాత రిక్వెస్ట్
వరుస వివాదాల నేపథ్యంలో ‘డాకు మహారాజ్’ నిర్మాత నాగవంశీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇది మనందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వటానికి ప్రయత్నిద్దాం’ అని ఫ్యాన్స్కు విజ్ఞప్తి చేశారు. ‘దబిడి దిబిడి’ సాంగ్ డాన్స్ స్టెప్స్ <<15050852>>వివాదం<<>>, ఫ్యాన్స్ వార్స్ నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఈనెల 12న రిలీజవుతోంది.