News January 22, 2025

UPL లిమిటెడ్ సీఈఓతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం

image

దావోస్ పర్యటనలో భాగంగా UPL లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ CEO జైదేవ్ శ్రాఫ్‌తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో అత్యాధునిక R&D సెంటర్, సీడ్ హబ్ ఏర్పాటు చేయడం గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కంపెనీ భాగస్వామ్యంతో దీర్ఘకాలిక వ్యవసాయాభివృద్ధిని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

Similar News

News February 18, 2025

కరీంనగర్: వ్యక్తిపై కొడవలితో దాడి.. తీవ్ర గాయాలు

image

హత్యాయత్నం చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బత్తిని సాగర్ పై అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి భూసంబంధిత విషయంలో కొడవలితో దాడి చేయగా సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

CHMD: కీలకంగా మారనున్న మండల ఓటర్లు

image

హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలంలో 2,179 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలోనే అత్యధిక MLC ఓట్లు కలిగిన మండలంగా చిగురుమామిడి మండలం కీలకంగా మారనుంది. అయితే MLc అభ్యర్థుల దృష్టి ఈ మండలంపై ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇక్కడి ఓటర్లు ఎవరికీ పట్టం కడుతారో ఫిబ్రవరి 27వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

News February 18, 2025

కరీంనగర్: జీవం తీస్తున్న ఆన్లైన్ జూదం..!

image

ఇద్దరు యువకులు ఆన్‌లైన్ మోసాలకు బలైన ఘటన శంకరపట్నం మండలంలో జరిగింది. గద్దపాకకి చెందిన భూస కార్తిక్(25) ఆన్‌లైన్ రమ్మీ ఆడి రూ.15లక్షలు మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పలపల్లికి చెందిన ఎడిగమధు(35) అనే యువ రైతు ఆన్‌లైన్ జూదంలో రూ. 10 లక్షలు మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగుల పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

error: Content is protected !!