News November 25, 2024
అదానీ అంశంపై రచ్చ: బుధవారానికి వాయిదాపడ్డ పార్లమెంటు

పార్లమెంటు ఉభయసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ, రాజ్యసభ ఆరంభమైన కాసేపటికే ఇండియా కూటమి సభ్యులు ఆందోళనకు దిగారు. గౌతమ్ అదానీపై న్యూయార్క్ కోర్టులో అభియోగాల నమోదుపై చర్చించాలని పట్టుబట్టారు. JPC వేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి సద్దుమణగక పోవడంతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభలను వాయిదా వేశారు.
Similar News
News November 15, 2025
1.20L గ్లైడ్ బాంబుల తయారీకి రష్యా ప్లాన్?

తమ దేశంపై దాడి కోసం రష్యా 1,20,000 గ్లైడ్ బాంబుల తయారీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఉక్రెయిన్ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ఆరోపించారు. వీటిలో 200KMకు పైగా లక్ష్యాలను చేరుకునే 500 లాంగ్ రేంజ్ వెర్షన్ బాంబులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వీటి వల్ల ఉక్రెయిన్‌కు భారీ నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ ఆరోపణలపై మాస్కో స్పందించలేదు. కాగా 2022 నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
News November 15, 2025
SSMB29: టైటిల్ ‘వారణాసి’

రాజమౌళి- మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 సినిమాకు ‘వారణాసి’ టైటిల్ ఖరారైంది. అలాగే మహేశ్ క్యారెక్టర్‌ను రుద్రగా పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో మహేశ్ నందిపై కూర్చున్న లుక్ అదిరిపోయింది. GlobeTrotter పేరుతో ప్రస్తుతం RFCలో ఈవెంట్ గ్రాండ్‌గా కొనసాగుతోంది.
News November 15, 2025
ఓటింగ్‌కి ముందు వీడియోలు వైరల్.. వివాదాల నడుమ విజయం

బిహార్ బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ పిన్టూ సీతామఢీలో విజయం సాధించారు. అయితే ఓటింగ్‌కు ముందు పిన్టూ ఓ మహిళతో అభ్యంతరకరమైన రీతిలో ఉన్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే అవి ఫేక్ అని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023లోనూ ఇదే విధంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన పిన్టూ, తాజా ఎన్నికల్లో RJD అభ్యర్థి సునీల్ కుమార్ కుశ్వాహాను ఓడించారు. పిన్టూకి 1,04,226 ఓట్లు వచ్చాయి.


