News June 17, 2024

UPSC సన్నాహక వ్యూహాలపై ‘నారాయణ IAS’ వర్క్‌షాప్

image

నారాయణ IAS అకాడమీ UPSC సివిల్స్ ఆశావహుల కోసం సోమవారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో వర్క్ షాప్ నిర్వహించింది. “సివిల్ సర్వీసులకు మార్గం.. అంతర్దృష్టులు & వ్యూహాలు” పేరుతో అభ్యర్థులకు ప్రిపరేషన్ వ్యూహాలపై మార్గ నిర్దేశం చేశారు. DGM, R&D హెడ్ M.శివనాథ్ అభ్యర్థుల సందేహాలకు సమాధానాలు, సలహాలు ఇచ్చారు. తగిన ప్రణాళికలు విజయాన్ని సులభతరం చేస్తుందన్నారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు.

Similar News

News October 6, 2024

ఖమ్మం: వెదురు కోసం వెళ్లి గుండెపోటుతో మృతి

image

గుండెపోటులో వ్యక్తి చనిపోయిన ఘటన తల్లాడ మండలం జగన్నాథపురంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన మల్లికార్జునరావు (50) శనివారం ఉదయం వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లాడు. గుండెనొప్పి వస్తోందని మధ్యాహ్నం తనతో ఉన్నవారికి చెప్పాడు. వారు మల్లికార్జునరావును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

News October 6, 2024

దేశానికి రోల్ మోడల్‌గా కొత్త చట్టం: మంత్రి

image

ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్‌గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్) చట్టాన్ని తీసుకురానున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా సాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం, ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, అలా తాము చేయబోమన్నారు.

News October 6, 2024

దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తాం: మంత్రి

image

ప్రస్తుతం ఉన్న రెవిన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్) చట్టాన్ని తీసుకురానున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం, ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, అటువంటివి తాము చేయమన్నారు.