News April 24, 2025

UPSC సివిల్స్ పరీక్షలలో సత్తా చాటిన CRDA అధికారి

image

ఏపీ సీఆర్‌డీఏ ఎకనామిక్ డెవలప్మెంట్ విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బడబాగ్ని వినీష UPSC సివిల్స్-2024 పరీక్షలలో 467వ ర్యాంక్ సాధించారు. ఓ పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కఠినమైన సివిల్స్ పరీక్షలో ర్యాంక్ సాధించిన వినీషను పలువురు అభినందించారు. IAS/IFS క్యాడర్ అధికారిగా ప్రజలకు మరింతగా సేవలందిస్తానని వినీష ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Similar News

News April 25, 2025

పాక్‌ను బెదిరిస్తే సమస్యలు పరిష్కారం కావు: శివసేన UBT

image

పహల్గామ్ ఉగ్రదాడి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని శివసేన(ఉద్ధవ్ వర్గం) తమ అధికారిక పత్రిక సామ్నాలో విమర్శించింది. ‘ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీర్‌లో ఏం ఒరిగింది? హిందువులపై హింస ఆగిందా? జేమ్స్‌బాండ్‌లా ఫోజులిచ్చే అజిత్ దోవల్ ఏం చేస్తున్నారు? పాక్‌ను బెదిరించినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. హిందువులపై దాడి జరగగానే పాకిస్థాన్, ముస్లింలపై ఏడవటం బీజేపీకి అలవాటు అయిపోయింది’ అని మండిపడింది.

News April 25, 2025

RCB సూపర్ విక్టరీ.. మలుపు తిప్పిన రివ్యూ

image

రాజస్థాన్‌పై RCB సూపర్ విక్టరీకి ఓ రివ్యూ బాటలు వేసింది. RR విజయానికి 12 బంతుల్లో 18 పరుగులు అవసరం ఉండగా హేజిల్‌వుడ్ బౌలింగ్ వేశారు. మూడో బంతిని జురెల్ మిస్సయ్యాడని అందరూ అనుకున్నారు. అంపైర్ కూడా ఆసక్తి చూపలేదు. కీపర్ జితేశ్ మాత్రం రివ్యూ కావాలన్నారు. బంతి బ్యాట్ ఎడ్జ్ తాకినట్టు తేలడంతో జోరుమీదున్న జురెల్(47- 3 సిక్సులు, 3 ఫోర్లు) ఔటయ్యారు. దీంతో మ్యాచ్ RCB చేతిలోకి వచ్చింది.

News April 25, 2025

చౌటుప్పల్: అంత్యక్రియలకు వెళ్తూ మహిళ మృతి

image

రోడ్డు ప్రమాదంలో చిట్యాల మండలం ఏపూర్‌కు చెందిన మహిళ మృతి చెందింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బంధువు అంత్యక్రియల కోసం కొండే జంగయ్య, హైమావతి బైక్‌పై బయలుదేరారు. చౌటుప్పల్ మండలం రెడ్డిబావి సమీపంలో బైక్‌ను డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైమావతి మృతిచెందింది.

error: Content is protected !!