News October 22, 2024

UPSC-ESE-2025 నోటిఫికేషన్ విడుదల

image

ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్-2025కు UPSC నోటిఫికేషన్ ఇచ్చింది. దేశంలోని రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ/బీటెక్ పూర్తైన 21-30 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. నవంబర్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 23 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణ చేసుకోవచ్చు. వచ్చే ఏడాదిలో ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News December 15, 2025

T20 సిరీస్‌ నుంచి అక్షర్ పటేల్ ఔట్

image

సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో మిగిలిన మ్యాచులకు టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు మ్యాచులకు ఆయన అందుబాటులో ఉండరని తెలిపింది. అక్షర్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకుంది. 5 మ్యాచుల T20 సిరీస్‌లో ఇప్పటివరకు 3 మ్యాచులు జరగగా IND 2, SA 1 గెలిచాయి. ఈ నెల 17న 4th, 19న 5th టీ20 జరగనుంది.

News December 15, 2025

మెస్సీ టూర్ గందరగోళం.. కలకత్తా హైకోర్టులో PIL

image

ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ టూర్ సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో ఏర్పడిన గందరగోళంపై హైకోర్టులో PILలు దాఖలయ్యాయి. వీటిని స్వీకరించిన కోర్టు వచ్చేవారం విచారిస్తామని పేర్కొంది. LOP సువేందు అధికారి తదితరులు వీటిని దాఖలు చేశారు. నిష్పాక్షిక దర్యాప్తుకోసం CBI, ED, SFIOతో విచారించాలని కోరారు. కాగా మిస్‌మేనేజ్మెంటు, స్టేడియంలో విధ్వంసం ఘటనలపై CM మమత రాష్ట్ర ప్రభుత్వ కమిటీతో విచారణకు ఆదేశించడం తెలిసిందే.

News December 15, 2025

యూరియా బుకింగ్ కోసం యాప్: తుమ్మల

image

TG: యాసంగికి సరిపడా యూరియా అందుబాటులో ఉంచుతామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు బారులు తీరాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునేందుకు త్వరలో మొబైల్ యాప్ విడుదల చేస్తామన్నారు. కాగా ఇప్పటికే 2.48 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రంలో అందుబాటులో ఉండగా.. డిసెంబర్‌కు కేటాయించిన యూరియా కూడా చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.