News June 25, 2024
ఏఐ టెక్నాలజీతో సిద్ధమవుతోన్న UPSC

పరీక్షల ప్రక్రియను పటిష్ఠపర్చేలా ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత CCTVలతో పర్యవేక్షణ వ్యవస్థను UPSC రూపొందించుకోనుంది. పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు ఆఫ్లైన్కి వెళ్లినా, అనుమానాస్పద కదలికలున్నా, సమయం దాటి ఇన్విజిలేటర్ అక్కడే ఉన్నా ఈ సిస్టమ్ అధికారుల్ని అలర్ట్ చేస్తుంది. సివిల్ సర్వీసెస్ IFSలతో సహా 14కీలక పరీక్షల్ని UPSC నిర్వహిస్తోంది. ఏటా దాదాపు 26లక్షల మంది పోటీ పడుతుంటారు.
Similar News
News December 10, 2025
మరోసారి ఇండిగో విమానాల రద్దు

ఇండిగో విమానాల రద్దు మళ్లీ మొదలైంది. ఇవాళ దేశవ్యాప్తంగా సుమారు 300 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో 137, ముంబైలో 21, బెంగళూరులో 61 ఫ్లైట్స్ నిలిచిపోయాయి. శంషాబాద్ నుంచి బయల్దేరాల్సిన 70 విమానాలు కూడా రద్దయినట్లు తెలుస్తోంది. తీవ్ర సంక్షోభం తర్వాత తమ ఫ్లైట్స్ సర్వీసెస్ సాధారణ స్థితికి చేరాయని నిన్న ఇండిగో సీఈవో పీటర్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరోసారి విమాన సర్వీసులు రద్దయ్యాయి.
News December 10, 2025
కుందేళ్ల పెరుగుదలకు మేలైన ఆహారం

పుట్టిన 12 రోజుల తర్వాత నుంచి కుందేలు పిల్లలు ఆహారం తింటాయి. కుందేళ్లకు గడ్డితో పాటు దాణాలో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ చెక్క, తవుడు, లవణ మిశ్రమాలు తగిన పరిమాణంలో కలిపి మేతగా అందించాలి. లూసర్న్, బెర్సీమ్, నేపియర్, పారాగడ్డి, వేరుశనగ, చిక్కుడు, సోయా, పిల్లిపెసర ఆకులను మేతలో కలిపి ఇవ్వవచ్చు. కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. నీటిని అందుబాటులో ఉంచాలి.
News December 10, 2025
రాష్ట్రంలో పరువు హత్య!

TG: హైదరాబాద్ శివారు అమీన్పూర్లో పరువు హత్య కలకలం రేపింది. బీటెక్ స్టూడెంట్ శ్రవణ్ సాయి ఓ అమ్మాయిని ప్రేమించాడు. అది ఇష్టం లేని యువతి పేరెంట్స్ అతడిని నిన్న హాస్టల్ నుంచి బయటికి తీసుకెళ్లారు. అనంతరం సాయిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని వారే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


