News April 24, 2025
UPSC సివిల్స్ పరీక్షలలో సత్తా చాటిన CRDA అధికారి

ఏపీ సీఆర్‌డీఏ ఎకనామిక్ డెవలప్మెంట్ విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బడబాగ్ని వినీష UPSC సివిల్స్-2024 పరీక్షలలో 467వ ర్యాంక్ సాధించారు. ఓ పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కఠినమైన సివిల్స్ పరీక్షలో ర్యాంక్ సాధించిన వినీషను పలువురు అభినందించారు. IAS/IFS క్యాడర్ అధికారిగా ప్రజలకు మరింతగా సేవలందిస్తానని వినీష ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Similar News
News April 25, 2025
HYD: సెలవుల్లో జూపార్క్ చుట్టేద్దాం..!

వేసవి సెలవుల్లో జూపార్క్ అధికారులు విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. మే నెలలో జూ టూర్ పేరుతో చిన్నారులకు జూ మొత్తం చూపించనున్నారు. స్నాక్స్, భోజనం కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక ప్రత్యేకంగా రూపొందించిన కిట్ (క్యాప్, నోట్‌బుక్, బ్యాడ్జ్) ఇస్తారు. రూ.1,000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికే ఈ అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. 9281007836కు వాట్సప్‌లో సంప్రదించవచ్చు.
News April 25, 2025
VJA: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

హౌరా-చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కార్గో బోగి రైల్వే చక్రాలు దగ్గర మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం తేలప్రోలు దగ్గర మంటలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్‌ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తేలప్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ మంటలను ఆర్పి వేశారు. అనంతరం ట్రైన్ విజయవాడ వైపు కదిలింది.
News April 25, 2025
IPL: ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని గెలవాలి?

IPL 2025లో సాధారణంగా ఏవైనా జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 8 మ్యాచులు(16 పాయింట్లు) గెలవాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రకారం ఆయా జట్లు కింది సంఖ్యలో మ్యాచులు గెలవాల్సి ఉంటుంది.
* గుజరాత్ టైటాన్స్(GT)- 2, DC- 2, RCB-2,
* PBKS-3, LSG-3, MI-3
* KKR-5, SRH-6, CSK-6
* RR-అవకాశాలు లేనట్లే.