News October 30, 2024

ఏప్రిల్‌లోనే ఎప్‌సెట్!

image

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు పరీక్షలకు నిర్వహించే ఎప్‌సెట్ పరీక్షను వచ్చే ఏప్రిల్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు సమాచారం. ఏటా మేలో పరీక్ష నిర్వహిస్తుండగా క్లాసులు మొదలవడానికి SEP వరకు సమయం పడుతోంది. దీంతో APRలో ఇంటర్ ఎగ్జామ్స్ ముగిశాక ఎప్‌సెట్ నిర్వహించి జులైలో క్లాసులు మొదలయ్యేలా ప్లాన్ చేస్తోంది. ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్‌పై సైతం కసరత్తు చేస్తోంది.

Similar News

News February 16, 2026

ఏటా 2 ఇంజెక్షన్లు.. బీపీకి చెక్!

image

మారిన జీవన శైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే BP బారిన పడుతున్నారు. దాన్ని నియంత్రించుకునేందుకు రోజూ మాత్రలు వాడుతున్నారు. ఇకపై ఆ అవసరం ఉండకపోవచ్చు. ఏటా 2 ఇంజెక్షన్లు వేయించుకుంటే సరిపోతుంది. ఈ మేరకు USకు చెందిన రోచీ అండ్ అల్నిలమ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ జిలెబెసిరన్ అనే ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

News February 16, 2026

ఏటి ఈతకు లంక మేతకు సరి

image

ఒక పశువు నదిని (ఏరు) ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న లంక భూమికి వెళ్తుంది. అక్కడ కడుపు నిండా మేత మేస్తుంది. కానీ తిరిగి ఇంటికి రావాలంటే మళ్ళీ అదే నదిని ఈదుకుంటూ రావాలి. ఆ ఈతలో పడే కష్టం వల్ల మేసిన మేత అంతా అరిగిపోతుంది. అంటే, ఆ పశువుకు మేత వల్ల వచ్చిన శక్తి, నదిని ఈదడానికే ఖర్చయిపోతుంది. ఎవరైనా ఒక పనిలో ఎంత సంపాదిస్తున్నారో అదంతా ఆ పని చేయడానికే ఖర్చయిపోతే లాభంలేదని చెప్పడానికి ఈ సామెత వాడతారు.

News February 16, 2026

విరమణ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి?

image

రోజంతా ఉపవాసం ఉన్నందున, విరమణ సమయంలో ఒకేసారి భారీ ఆహారం తీసుకోకూడదు. ముందుగా మంచినీరు, పండ్ల రసంతో కడుపుని తేలికపరచాలి. ఆ తర్వాత సాత్విక ఆహారమైన అన్నం, పప్పులు వంటి సులభంగా అరిగే పదార్థాలను తీసుకోవాలి. కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడకుండా కాపాడుతుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఈరోజు మాంసాహారం అస్సలు తినకూడదని పండితుల సూచన.