News September 20, 2025
పంచాయతీల్లో పట్టణ స్థాయి ప్రగతి: పవన్

AP: గ్రామ పంచాయతీల్లో గతంలో అమలులో ఉన్న లోపభూయిష్ట విధానాల ప్రక్షాళన అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల పునర్వర్గీకరణ, నూతన విధానాల అమలుపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. 48 ఏళ్లనాటి సిబ్బంది నమూనాకు మార్పులు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆదాయం, జనాభా, ప్రాంతం ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడ్లు నిర్ణయించనున్నారు. క్యాబినెట్ ముందుకు త్వరలో నూతన విధానాలు తీసుకెళ్లనున్నారు.
Similar News
News September 20, 2025
నేడు మాచర్లకు సీఎం చంద్రబాబు

AP: నేడు CM చంద్రబాబు పల్నాడు(D) మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉ.10.30 గం.కు మాచర్లకు చేరుకుని స్థానిక చెరువు పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టనున్నారు. హెల్త్ క్యాంపులో సఫాయి కర్మచారీలతో మాట్లాడనున్నారు. మున్సిపాల్టీలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు రూ.2 కోట్ల చెక్కు అందించనున్నారు. మున్సిపల్ కమిషనర్లు, పాఠశాలల ప్రతినిధులను సన్మానించనున్నారు.
News September 20, 2025
నిద్రలేవగానే అరచేతులు ఎందుకు చూడాలి?

ఉదయం నిద్రలేవగానే అరచేతులను చూడటం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మన అరచేతిలో లక్ష్మీ, సరస్వతి, గౌరీదేవి(పార్వతి) కొలువై ఉంటారని అంటున్నారు. చేతి అగ్రభాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి దేవి, మూలంలో పార్వతీ దేవి ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఉదయం నిద్రలేవగానే అరచేతులు చూసుకోవడం, వాటిని కళ్లకు అద్దుకోవడం ద్వారా ఆ ముగ్గురు దేవతల ఆశీస్సులు లభించి, అదృష్టం వరిస్తుందని నమ్మకం.
News September 20, 2025
ప్రార్థన ఎలా చేయాలి?

ప్రార్థన అంటే నోటితో పలికే మాట కాదు. అది మనసులో నుంచి రావాలి. ఈ దైవ స్ఫురణలో ప్రేమ, భక్తి జాలువారాలి. అప్పుడే మనసులోని చీకటి తొలగిపోయి, దైవ కాంతి ప్రకాశిస్తుంది. మన కోర్కెలు తీర్చే ఆ భగవంతుడికి మనం ఏమి కోరుతామో ముందే తెలుస్తుంది. అందుకే ప్రత్యేకంగా ఆయనను ఏదీ అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఏది ఇస్తే అది మనకు మహద్భాగ్యమని భావించాలి. ఇదే నిజమైన ప్రార్థన.