News September 9, 2025
రైతు వేదికల్లోనూ యూరియా పంపిణీ: తుమ్మల

TG: యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల్లోనూ నిన్నటి నుంచి యూరియా పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. ముందుగానే టోకెన్లు జారీ చేయడంతో పంపిణీ సజావుగా సాగుతున్నట్లు వెల్లడించారు. జియో పొలిటికల్ ఉద్రిక్తతలు, దేశీయ ఉత్పత్తి తగ్గడంతో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి తెలిపారు.
Similar News
News September 9, 2025
హైకోర్టు తీర్పు రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టు: హరీశ్

TG: CM రేవంత్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయన ట్వీట్ చేశారు. ‘పరీక్షలు ఎలా నిర్వహించాలో కూడా ప్రభుత్వానికి తెలియదు. పరీక్షలు నిర్వహించడం, ఉద్యోగాలు ఇవ్వడమంటే చిల్లర రాజకీయాలు చేసినంత ఈజీ కాదు. ఇప్పటికైనా CM స్పందించి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
News September 9, 2025
ఇంటర్ ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల

AP: ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ చదువుతున్న విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపునకు ఇంటర్ విద్యా మండలి సెక్రటరీ కృతికా శుక్లా <
News September 9, 2025
ఓటేసిన టీడీపీ, బీజేపీ ఎంపీలు

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. కాసేపటి క్రితమే టీడీపీ ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 16 మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఓటు వేశారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఎంపీలు సైతం ఓటు వేశారు. వీరిలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ఈటల, డీకే అరుణ తదితరులున్నారు.