News August 21, 2025
దేశవ్యాప్తంగా యూరియా సమస్య: తుమ్మల

TG: యూరియా కొరతపై రాష్ట్రంలోని రైతులు <<17459555>>నిరసనలు<<>> చేపట్టిన నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉందన్నారు. కొందరు తెలంగాణలోనే ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. కేంద్రం తీరువల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నెలాఖరు వరకు కేంద్రం తమ వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూరియాను చూడని వారే తనపై విమర్శలు చేస్తున్నారంటూ రాష్ట్ర BJP నేతలపై ధ్వజమెత్తారు.
Similar News
News March 23, 2026
షెడ్యూల్ ప్రకారమే IPL మ్యాచులు: అధికారి

ఈ నెల 28 నుంచి IPL షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని లీగ్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఫారిన్ ప్లేయర్లు పాల్గొంటారా లేదా అనేది ఫ్రాంచైజీలు చూసుకుంటాయని, ఆ నిర్ణయం వారిదేనని తెలిపారు. వర్క్‌లోడ్, గాయాల వల్ల కొందరు ఇంకా ఆయా జట్లలో చేరలేదని పేర్కొన్నారు. కాగా తమ దేశాల క్రికెట్ బోర్డుల నుంచి NOC రాలేదని స్టార్క్ సహా పలువురు ఆటగాళ్లు ఇంకా IPL <<19429037>>టీమ్‌లలో<<>> చేరని సంగతి తెలిసిందే.
News March 23, 2026
త్వరలో రష్యా పర్యటనకు మోదీ!

ప్రధాని మోదీ ఈ ఏడాది రష్యాలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇండియా, రష్యా మధ్య జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో లావ్రోవ్ మాట్లాడారు. రెండు దేశాలది కాల పరీక్షకు నిలిచిన స్నేహమని కొనియాడారు. గతేడాది డిసెంబర్‌లో రెండు రోజులపాటు ఇండియాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ <<18475772>>పర్యటించడం<<>> తెలిసిందే.
News March 23, 2026
CGD నెట్వర్క్‌తో ఇంటింటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్

AP: LPG కొరత నేపథ్యంలో ఇళ్లకు, వ్యాపారాలకు PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్) పంపిణీకి GOVT చర్యలు చేపట్టింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు GO జారీచేసింది. PNG సరఫరాకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ను అభివృద్ధి చేయనుంది. ఈమేరకు విధివిధానాలను నిర్దేశించింది. పైప్ లైన్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు అనుమతులు వంటివి వేగంగా పూర్తయ్యేలా గడువు విధించింది. ఇందుకు వివిధ కమిటీల ఏర్పాటుకు ఆదేశించింది.


