News September 7, 2025
ప్రభుత్వ అవినీతి వల్లే యూరియా కొరత: బొత్స

AP: యూరియా కొరతపై ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరిస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతుల ఇబ్బందులు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతి వల్లే ఈ సమస్య వచ్చిందని ఫైరయ్యారు. అటు ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, నెట్‌వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదని ఆరోపించారు.
Similar News
News September 7, 2025
వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగు: మహేశ్ గౌడ్

TG: బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగి వచ్చేలా ఈ నెల 15న కామారెడ్డి సభ ఉండనుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. BJP నేతలు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటారని ఫైరయ్యారు. లిక్కర్ రాణిగా కవిత నిజామాబాద్‌కు చెడ్డపేరు తీసుకొచ్చారని విమర్శించారు. కవిత ఎపిసోడ్ KCR ఆడించే డ్రామా అని సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగవుతుందన్నారు.
News September 7, 2025
ఈ నెల 15 నుంచి UPI లిమిట్ పెంపు.. రోజుకు ఎంతంటే?

ఈ నెల 15 నుంచి కొన్ని ప్రత్యేకమైన పేమెంట్స్(P2M)కు UPI లిమిట్‌ను రోజుకు రూ.10 లక్షలకు పెంచుతూ NPCI నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు రూ.లక్ష మాత్రమే UPI ద్వారా పంపొచ్చు. ఇన్సూరెన్స్, పన్నులు, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవాళ్లకు ఇది ఇబ్బందిగా మారడంతో ఒక్కసారి రూ.5 లక్షలు, రోజుకు రూ.10 లక్షలు పంపుకునే వెసులుబాటు కల్పించింది. కాగా మనం (P2P) స్నేహితులు, బంధువులకు పంపే లిమిట్ మాత్రం రూ.లక్షగానే ఉంది.
News September 7, 2025
ఇవాళ చంద్ర గ్రహణాన్ని చూడొచ్చా?

ఇవాళ ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం ఇండియాలోనూ స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మీరు ఎలాంటి పరికరం లేకుండానే గ్రహణాన్ని నేరుగా చూడొచ్చని, బైనాక్యులర్ ఉంటే మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. రాత్రి 8.58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 11గంటల నుంచి అర్ధరాత్రి 12.22గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటల వరకు ఇది కొనసాగనుంది.