News August 26, 2025
యూరియా.. అన్నదాత ఆవేదన వినరా!

తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు తీవ్రస్థాయికి చేరాయి. రాత్రీపగలు తేడా లేకుండా అన్నదాతలు ఎరువుల దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. యూరియా పాపం కేంద్రానిదేనని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ సర్కారే కృత్రిమ కొరత సృష్టిస్తోందని BJP అంటోంది. ఇక యూరియా కొరతకు BJP, కాంగ్రెస్సే కారణమని BRS మండిపడుతోంది. ఇలాంటి రాజకీయ విమర్శలకే పరిమితమైన పార్టీలు రైతుల సమస్యకు మాత్రం పరిష్కారం చూపడం లేదు.
Similar News
News August 26, 2025
వాన్‌పిక్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

AP మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో CBI ఛార్జ్‌షీట్ నుంచి పేరు తొలగించాలని వాన్‌పిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను TG హైకోర్టు కొట్టేసింది. 2022 JULలో వాన్‌పిక్ ప్రాజెక్టు పిటిషన్‌ను హైకోర్టు అనుమతించగా తమ వాదనలు పట్టించుకోకుండా ఉత్తర్వులు ఇచ్చిందంటూ CBI సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో మరోసారి విచారించాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా వాదనలు విన్న హైకోర్టు పిటిషన్‌ను కొట్టేసింది.
News August 26, 2025
లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపండి: NGT

TG: నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ అనుమతులు లేకుండా కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టొద్దని ఆదేశించింది. ఇప్పటివరకు పనులు చేయడంపై రాఘవా కన్‌స్ట్రక్షన్, మేఘా ఇంజినీరింగ్ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా పనులు చేపడితే తమ దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు NGT సూచించింది.
News August 26, 2025
దేశంలో అత్యంత విద్యావంతుడు ఇతడే!

ఇండియాలో మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరనే ప్రశ్నకు చాలా మందికి జవాబు తెలియకపోవచ్చు. ఆయనే మహారాష్ట్రకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ జిచ్కర్. తన జీవితంలో 42 విశ్వవిద్యాలయ పరీక్షలు రాసి, ఏకంగా 20కి పైగా డిగ్రీలు పొందారు. MBBS & MD, LLB, LLM, MBA, జర్నలిజంలో పీజీ చేశారు. IPS & IAS కూడా అయ్యారు. అతి పిన్న వయస్కుడైన (26ఏళ్లలో) ఎమ్మెల్యేగానూ రికార్డులకెక్కారు. 2004లో రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు.