News August 20, 2025
ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మూత్రం పోయడంతో..

TG: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిపే ఘటన ఇది. సూర్యాపేటలో చక్రధర్(50) అనే వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మూత్ర విసర్జన చేయడంతో చనిపోయాడు. వర్షంతో ట్రాన్స్‌ఫార్మర్ ఉన్న ప్రాంతమంతా అప్పటికే తడిగా మారింది. దీంతో మూత్రం పోయగానే చక్రధర్‌కు షాక్ కొట్టి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి చూడగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
BE ALERT
Similar News
News August 20, 2025
ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందే: రేవంత్

TG: ప్రపంచస్థాయి నగరంలో ప్రభుత్వ ఆఫీసులు సరిగ్గా లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYDలోని గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గచ్చిబౌలిలో 8 నెలల్లో అంతర్జాతీయ స్థాయి నూతన భవన సముదాయాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మూసీ ప్రక్షాళనను కొందరు వ్యతిరేకించినా ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనని నొక్కి చెప్పారు.
News August 20, 2025
ఢిల్లీ సీఎంపై దాడికి కారణమిదేనా?

ఢిల్లీ CM రేఖా గుప్తాపై రాజేశ్ <<17460103>>దాడికి<<>> పాల్పడిన సంగతి తెలిసిందే. గుజరాత్‌కు చెందిన నిందితుడు శునక ప్రేమికుడని, సుప్రీంకోర్టు <<17368812>>తీర్పుతో<<>> కలత చెంది ఢిల్లీకి వెళ్లాడని అతడి తల్లి పేర్కొంది. ఇదే విషయమై CMను ప్రశ్నించేందుకు వెళ్లి దాడి చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిది హింసా ప్రవృత్తి అని, మానసిక పరిస్థితి బాగాలేదని అతడి తల్లి తెలిపారు. తనతో సహా పొరుగువారినీ కొట్టేవాడని వివరించారు.
News August 20, 2025
ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యం: చంద్రబాబు

AP: రతన్ టాటా భరతమాత ముద్దు బిడ్డ అని CM చంద్రబాబు అన్నారు. ఎవరైనా డబ్బు సంపాదించాలని చూస్తారని, టాటా మాత్రం సంపాదనను ఇతరులకు పంచేవారని చెప్పారు. RTIH ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తు అంతా ITదేనని గుర్తు చేశారు. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే సంపద వస్తుందన్నారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ నిపుణుడు ఉండాలని పనిచేశామని, ఇప్పుడు ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యమని తెలిపారు.