News June 13, 2024
త్వరలో ఊరూరా ఆరోగ్య పరీక్షలు!

TG: ఊరూరా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. దీనికోసం మొబైల్ ల్యాబ్లను సిద్ధం చేయనుంది. 26-70 ఏళ్ల వయసున్న వారికి అన్ని రకాల రక్తపరీక్షలు, క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనుంది. ఆరోగ్య సమస్యలున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనుంది. NHMలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు సమకూర్చనున్నాయి.
Similar News
News November 20, 2025
మరో ఉగ్ర దాడికి జైషే కుట్ర?

పాక్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ మన దేశంలో మరో దాడికి కుట్ర చేస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆత్మాహుతి స్క్వాడ్ను సిద్ధం చేస్తోందని హెచ్చరించాయి. ‘ఇందుకోసం జైషే నాయకులు డిజిటల్ మార్గాల్లో నిధుల సేకరణకు పిలుపునిచ్చారు. ₹6,400 చొప్పున ఇవ్వాలని అడుగుతున్నారు. వారు మహిళల నేతృత్వంలో దాడికి కుట్ర పన్నుతున్నారు’ అని తెలిపాయి. ఢిల్లీ పేలుడు ఘటనలో జైషే హస్తం ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
News November 20, 2025
బోర్డులను “బ్రోకర్ల డెన్”లుగా మార్చారు: సంజయ్

కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల భక్తులకు ప్రభుత్వం, దేవస్వం బోర్డు చేసిన ఏర్పాట్లు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. ఇటీవల AP భక్తులతో కేరళ పోలీసు అధికారి <<18328677>>అసభ్యకరంగా ప్రవర్తించడం<<>>పై మండిపడ్డారు. దేవస్వం బోర్డులను కమ్యూనిస్టులు “బ్రోకర్ల డెన్”లుగా మార్చి, ఆలయాలను ATM కేంద్రాలుగా చూస్తున్నారన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఫైరయ్యారు.
News November 20, 2025
బెంటోనైట్ క్లే గురించి తెలుసా?

చర్మాన్ని సంరక్షించడంలో ఫేస్ ప్యాక్లు కీలకపాత్ర పోషిస్తాయి. వాటిల్లో ఒకటే ఈ బెంటోనైట్ క్లే. అగ్నిపర్వతాలు పేలడం ద్వారా ఏర్పడిన బూడిదతో దీన్ని తయారు చేస్తారు. దీనిలో ఉండే సోడియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాక్నేని, చర్మంలోని మురికిని దూరం చేస్తాయి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది.


