News October 26, 2024
ఎలక్ట్రీషియన్ల సేవలు కోసం ఊర్జవీర్ స్కీమ్

AP: రాష్ట్రంలోని 1.2లక్షల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లను ‘ఊర్జవీర్ ఎనర్జీ ఎఫీషియన్సీ వారియర్ స్కీం’ కింద వినియోగించుకోవాలని GOVT నిర్ణయించింది. కేంద్రంతో కలిసి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లనుంది. ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాలను వీరి సాయంతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం, వీధి దీపాల నిర్వహణలో వీరి సేవలను వినియోగించుకుంటామని CM చంద్రబాబు తెలిపారు.
Similar News
News March 18, 2025
ధోనీ ఫిట్నెస్ చూసి షాకయ్యాను: హర్భజన్

43 ఏళ్ల వయసులోనూ ధోనీ ఫిట్నెస్ చూసి షాకైనట్లు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపారు. ‘ఓ పెళ్లికి హాజరైన సందర్భంగా ఇద్దరం కలిశాం. చాలా ఫిట్‌గా, సాలిడ్‌గా కనిపించారు. ఈ వయసులో ఇలా ఉండటానికి ఏం చేస్తున్నావని అడిగా. ఆటలో సంతోషం పొందుతున్నానని, ఆడాలని ఉంది కాబట్టే ఆడుతున్నానని అన్నారు. రోజూ 3 గంటలపాటు కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్‌నుంచి అందరికంటే చివరగా బయటికొచ్చేది ఆయనే’ అని తెలిపారు.
News March 18, 2025
వీకెండ్‌లోపు రూ.50 కోట్ల క్లబ్‌లోకి ‘కోర్టు’ మూవీ!

నేచురల్ స్టార్ నాని నిర్మించిన ప్రతి సినిమా సక్సెస్ అవుతోంది. తాజాగా ఆయన నిర్మించిన ‘కోర్టు’ సినిమా విమర్శల ప్రశంసలు పొంది భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం నిన్న రూ. 4 కోట్ల వరకు వసూలు చేయడంతో నాలుగు రోజుల్లో రూ.28.9 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ వీక్‌లో రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది. ‘వాల్ పోస్టర్ సినిమా’ నుంచి వచ్చిన awe, hit1&2, కోర్టు భారీ విజయాలను అందుకున్నాయి.
News March 18, 2025
సిRAW: తప్పెవరిది? లోపం ఎక్కడుంది..?

‘<<15797491>>JNTUH సెమిస్టర్-1లో 75% స్టూడెంట్స్ ఫెయిల్<<>>’ అనే విషయం అనేక ప్రశ్నల్ని సంధిస్తోంది. ఇంటర్ వరకు బాగా చదివేందుకు అప్పటివరకు ఉన్న పర్యవేక్షణ, కాలేజీల ఒత్తిడి కారణమా? లేక బట్టీ విధానమా? బీటెక్‌లోకి రావడంతోనే వచ్చిన స్వేచ్ఛా రెక్కలతో విహరిస్తున్నారా? తల్లిదండ్రుల కోసం తప్పక చేరిన MPCని ఎలాగోలా గట్టెక్కి ఇక్కడ తేలిపోతున్నారా? కారణమేదైనా కాబోయే ఇంజినీర్ల నుంచి కాంక్షించేది ఇది కాదు.