News February 10, 2026

USతో జరిగింది ‘ట్రాప్ డీల్’: ఖర్గే

image

USతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని మల్లికార్జున ఖర్గే ‘ట్రాప్ డీల్’గా అభివర్ణించారు. రష్యా నుంచి చమురు నిలిపివేయాలన్న షరతుకు ఒప్పుకోవడం భారత్ తన సార్వభౌమాధికారాన్ని కోల్పోవడమేనని ఆరోపించారు. Genetically Modified ఫీడ్, పప్పు ధాన్యాల దిగుమతులకు అంగీకరించడం రైతులకు జరిగే తీరని అన్యాయమని పేర్కొన్నారు. దుస్తుల ఎగుమతుల్లోనూ భారత్ కంటే బంగ్లాకే ఎక్కువ ప్రయోజనం చేకూరేలా ఈ ఒప్పందం ఉందని మండిపడ్డారు.

Similar News

News February 10, 2026

న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

image

T20WC: న్యూజిలాండ్‌పై UAE జట్టు విజృంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 20 ఓవర్లలో 173/6 రన్స్ చేసింది. వసీమ్(66*) అలిషాన్(55), మయాంక్ కుమార్(21) చెలరేగారు. మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేదు. 18వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ 27 రన్స్ సమర్పించుకున్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ 2, డఫ్పీ, ఫిలిప్స్, శాంట్నర్, ఫెర్గ్యూసన్‌ తలో వికెట్ దక్కింది. విజయం కోసం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 174 రన్స్ చేయాలి.

News February 10, 2026

త్వరలో రాష్ట్రంలో 15,247 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

image

TG: త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 15,247 అంగన్‌వాడీ కార్యకర్త, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయగానే భర్తీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. టెన్త్, ఇంటర్ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

News February 10, 2026

భారత బ్యాటర్లపై సంచలన ఆరోపణలు

image

భారత క్రికెటర్లపై శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స బ్యాట్ ట్యాంపరింగ్ ఆరోపణలు చేశారు. ఇతర జట్లు వాడే బ్యాట్ల కంటే IND క్రికెటర్ల బ్యాట్లు ఎక్కువ పవర్ జనరేట్ చేస్తాయన్నారు. ‘మాకు దొరికే బెస్ట్ బ్యాట్స్ కంటే IND ప్లేయర్ల బ్యాట్లు చాలా మెరుగైనవి. వాటిపై ఒక రబ్బర్ లేయర్ ఉంటుంది. ఇదెలా సాధ్యమో నాకు తెలియదు. వేరే వారికి ఈ బ్యాట్లు దొరకవు. ఆటగాళ్లందరికీ ఈ విషయం తెలుసు’ అని వ్యాఖ్యానించారు.