News February 5, 2026
USతో ట్రేడ్ డీల్.. భారత్‌పై పాక్‌లో ప్రశంసలు

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత పాక్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినా PM షరీఫ్ సుంకాల విషయంలో పురోగతి సాధించలేకపోయారని ఆ దేశ పౌరులు ఫైరవుతున్నారు. ఏం చేసినా గౌరవాన్ని కొనలేరని నిరూపితమైందన్నారు. పాక్‌ను చట్టవిరుద్ధమైన పనులు చేసే ఉంపుడుగత్తెలా ట్రంప్ చూశారని మండిపడుతున్నారు. భారత నాయకత్వం దేశం దాటకుండానే అద్భుతం చేసిందని కొనియాడుతున్నారు.
Similar News
News February 6, 2026
377 విమానాల్లో రిపీటెడ్ లోపాలు

దేశంలో వరుస విమాన ప్రమాదాల వేళ GOVT డేటా కలవరపెడుతోంది. గతేడాది JAN నుంచి 6 ఎయిర్‌లైన్స్ పరిధిలోని 754 విమానాలను పరిశీలించగా 377 ఫ్లైట్లలో రిపీటెడ్ లోపాలు బయటపడ్డాయి. 191 ఎయిరిండియా, 148 ఇండిగో, 16 స్పైస్‌జెట్, 14 ఆకాశ ఎయిర్ ఇండియా విమానాల్లో లోపాలు పునరావృతమయ్యాయని తేలింది. ఈ నివేదికపై ఎయిరిండియా అధికారి స్పందిస్తూ ‘మేం విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాం. ఇవి మైనర్ సమస్యలు’ అని పేర్కొన్నారు.
News February 6, 2026
వడ్డీ రేట్లు యథాతథం

కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. ఈ ఏడాదిలో ఇవాళ జరిగిన తొలి సమీక్షలో రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. గతేడాది ఈ వడ్డీరేట్లను ఆర్బీఐ పలుమార్లు సవరించిన విషయం తెలిసిందే. దీంతో 2025 FEB-DEC మధ్య రెపో రేటు 1.25 శాతం తగ్గింది.
News February 6, 2026
SACONలో 36 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ(SACON)లో 36పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, EWSలకు రూ.100. వెబ్‌సైట్: www.sacon.in


