News February 3, 2026
USతో ట్రేడ్ డీల్ వివరాలు బయటపెట్టాలి: INC

IND-US ట్రేడ్ డీల్ గురించి ట్రంపే ప్రకటన చేశారని ప్రధాని మోదీ కాదని కాంగ్రెస్ పేర్కొంది. మోదీ అభ్యర్థన మేరకే ఈ ఒప్పందం జరిగిందని, డీల్‌లోని వివరాలు వెల్లడించాలని Xలో డిమాండ్ చేసింది. ‘పార్లమెంటును, దేశాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలి. ఒప్పందంలోని కీలకాంశాలు తెలపాలి. యుద్ధ విరమణ ఒప్పందం లాగే, వాణిజ్య ఒప్పంద ప్రకటననూ ట్రంపే చేశారు. మోదీ అభ్యర్థన మేరకే వాణిజ్య ఒప్పందం జరుగుతోంది’ అని పేర్కొంది.
Similar News
News February 15, 2026
జగిత్యాల ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్!

TG: జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై ఉత్కంఠ వీడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జెండా మోసిన వారికే ఛైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. MLA సంజయ్, జీవన్‌రెడ్డితో మంత్రి అడ్లూరి, AICC సెక్రటరీ సవాంగ్ మాట్లాడారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. 23 మంది అభ్యర్థులతో MLA సంజయ్ క్యాంప్ ఏర్పాటు చేయగా, 14 మందితో జీవన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.
News February 15, 2026
మార్కులు మీ జీవితాన్ని డిసైడ్ చేయలేవు: వినీత్

జీవితంలో చదువుకు, సక్సెస్‌కు సంబంధం లేదని HCL మాజీ సీఈవో వినీత్ నాయర్ స్పష్టం చేశారు. ఒకవేళ బోర్డు పరీక్షలు, మార్కులే జీవితాన్ని డిసైడ్ చేస్తే 50 శాతం మంది సీఈవోలు నిరుద్యోగులుగా ఉంటారన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా, స్థిరంగా ఉండాలని, మార్కుల గురించి ఆందోళన చెందవద్దని సూచించారు. పరీక్షల ఒత్తిడిలో ఉన్న స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులకు ఈ కామెంట్లు ప్రేరణగా నిలుస్తాయని నెటిజన్లు కొనియాడుతున్నారు.
News February 15, 2026
వాయువ్య మూలలో వాస్తుదోషాలు ఉంటే?

వాయువ్య మూల దోషపూరితంగా ఉంటే ఆ ఇంట్లో మానసిక అశాంతి, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. అలాంటి స్థలంలో ఉండేవారు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు, ఫలితం లభించదని అంటున్నారు. ‘చేతికి అందాల్సిన అదృష్టం చేజారిపోతుంది. పిల్లల భవిష్యత్తు, ఇంటి పెద్దల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అవసరానికి ఎవరూ ఆదుకోరు. కోర్టు కేసులు, శత్రుబాధలు పెరిగే ఛాన్సుంది’ అంటున్నారు.<<-se>>#Vasthu<<>>


