News July 1, 2024
భారతీయ కంపెనీలకు US రాయబారి వార్నింగ్

రష్యాపై ఆంక్షలను ఉల్లంఘించే భారతీయ కంపెనీలు వాటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ హెచ్చరించారు. ‘US, సహా మిత్రదేశాలన్నీ మరో దేశాన్ని ఆక్రమించాలనే ఆలోచనకు వ్యతిరేకం. భారత్ ఇది దృష్టిలో పెట్టుకుని రష్యాకు పరోక్షంగా సాయపడుతున్న సంస్థలను గుర్తించడంలో సహకరిస్తుందని ఆశిస్తున్నా. US, దాని మిత్రదేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ఈ కంపెనీలు పరిణామాలు ఎదుర్కొంటాయి’ అని అన్నారు.
Similar News
News October 28, 2025
అవసరం లేని రూట్లలో బస్సులు నిలిపివేయండి: RTC MD

AP: భారీ వర్షాల నేపథ్యంలో అవసరం లేని రూట్లలో బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలివేయాలని అధికారులను RTC MD తిరుమలరావు ఆదేశించారు. ప్రయాణికుల రద్దీ ఉండే మార్గాల్లోనే సర్వీసులను నడపాలని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి హాల్ట్లు ఉంచొద్దని, ముంపునకు అవకాశమున్న కాల్వలు, కాజ్ వేలు, కట్టల మీదుగా వెళ్లే రూట్లలో బస్సులు నడపవద్దన్నారు. దూరప్రాంత సర్వీసులనూ రద్దీని బట్టే నడపాలని చెప్పారు.
News October 28, 2025
పిల్లలకు ఆన్లైన్ లిటరసీ నేర్పిస్తున్నారా?

ప్రస్తుతకాలంలో పిల్లలు స్మార్ట్ గ్యాడ్జెట్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయితే వారికి దీంట్లో ఉండే కష్టనష్టాల గురించి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనంటున్నారు నిపుణులు. సోషల్మీడియాపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. ఏదైనా పోస్ట్ చేసేముందు ఆలోచించాలని, గోప్యతకు ప్రాధాన్యతనివ్వాలని వారికి చెప్పాలి. ఆ పరిచయాలతోపాటు ఆఫ్లైన్లో దొరికే మానవసంబంధాల ప్రాధాన్యతనూ వారికి వివరించాలంటున్నారు.
News October 28, 2025
తుఫాను ఎఫెక్ట్.. పలు విమాన సర్వీసులు రద్దు

AP: మొంథా తుఫాను ప్రభావంతో నేడు విశాఖ, విజయవాడ విమానాశ్రయాలకు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఫైట్లు నిలిచిపోనున్నాయి. అయితే ఇండిగో ఫైట్లు 10.45AM వరకు, ఢిల్లీ-VJA సర్వీసులు నడుస్తాయని VJA ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అటు ఢిల్లీ, భువనేశ్వర్, VJA, రాయ్పూర్, హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు వెళ్లే సర్వీసులన్నీ ఆగిపోనున్నాయి.


