News February 17, 2025
రేపు అమెరికా, రష్యా ప్రతినిధుల భేటీ

రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. ఈమేరకు రేపు సౌదీఅరేబియాలో అమెరికా, రష్యా ప్రతినిధులు భేటీ కానున్నారు. యుద్ధం ముగింపుతో పాటు ఇరు దేశాల సంబంధాలపైనా చర్చించనున్నారు. మరోవైపు బైడెన్ హయాంలో ఉక్రెయిన్‌కు US నుంచి సాయం అందగా ట్రంప్ అధికారంలోకి రాగానే నిలిచిపోయింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈయూ దేశాల సాయం కోరుతున్నారు.
Similar News
News January 25, 2026
కలశంపై కొబ్బరికాయను ఎందుకు పెడతారు?

కొబ్బరికాయ బ్రహ్మాండానికి సంకేతం. అలాగే సృష్టి అంతటా నిండి ఉన్న భగవంతుని స్వరూపంగా కొలుస్తారు. కాయపై ఉండే పొర చర్మం, పీచు మాంసం, చిప్ప ఎముకలు, లోపలి కొబ్బరి ధాతువు, నీళ్లు ప్రాణాధారం, పీచు జ్ఞానానికి, అహంకారానికి ప్రతీకలు. పసుపు రాసిన వెండి లేదా రాగి కలశంపై ఆకులు, కొబ్బరికాయను ఉంచి వస్త్రంతో అలంకరిస్తే అది పూర్ణకుంభంగా మారుతుంది. ఇది దివ్యమైన ప్రాణశక్తి నిండిన జడ శరీరానికి ప్రతీకగా నిలుస్తుంది.
News January 25, 2026
గణతంత్ర దినోత్సవాన అత్యున్నత గౌరవం

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతితో కలిసి జెండా ఆవిష్కరణలో పాల్గొనే అవకాశాన్ని ఫ్లైట్ లెఫ్టినెంట్ అక్షితా ధంకర్ దక్కించుకున్నారు. హర్యానాకి చెందిన అక్షిత NCCలో చేరి క్యాడెట్ సార్జెంట్ మేజర్ స్థాయికి చేరుకున్నారు. తర్వాత NFTAC పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఫ్లయింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. తక్కువ వ్యవధిలోనే ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదాకు చేరుకున్న ఆమె తాజాగా ఈ అత్యున్నత గౌరవాన్ని సొంతం పొందారు.
News January 25, 2026
ఉద్యాన మొక్కల్లో ఇనుము లోప లక్షణాలు – నివారణ

నేలల్లో సున్నం అధికంగా ఉన్నప్పుడు, సాగునీటిలో బైకార్పోనేట్లు, కార్బోనేట్లు ఎక్కువైనప్పుడు ఉద్యాన మొక్కల్లో ఇనుము లోపం కనిపిస్తుంది. లేత ఆకుల్లో ఈనెలు ఆకుపచ్చగా ఉండి మిగిలిన భాగం పసుపుగా మారుతుంది. క్రమేణా ఆకు పాలిపోయి కాయలు, పిందెలు రాలిపోతాయి. 1 శాతం అన్నభేది ద్రావణాన్ని(10 గ్రా. అన్నభేది+ 5గ్రా. నిమ్మ ఉప్పు) లీటరు నీటికి కలిపి లక్షణాలు తగ్గేవరకు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.


