News June 19, 2024

తైవాన్‌కు అమెరికా సాయుధ డ్రోన్లు

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు చుక్కలు చూపించిన కొన్ని ఆయుధాలు తైవాన్ దేశానికి అందనున్నాయి. వీటిని అమెరికా తైవాన్ దేశానికి విక్రయించనుంది. ఈ డీల్ మొత్తం వాల్యూ 60 మిలియన్ డాలర్లు. ఇందులో భాగంగా 720 స్విచ్‌బ్లేడ్ డ్రోన్లు, ఫైర్ కంట్రోల్ వ్యవస్థ, 291 ఆల్టియూస్ 600ఎం లాయిటరింగ్ ఆయుధాలను అందించనుంది. కాగా తైవాన్‌ను ఆక్రమించుకోవాలనే దురాలోచనలో ఉన్న చైనాకు అమెరికా చర్య మింగుడుపడటం లేదు.

Similar News

News November 23, 2025

JGTL: TRTF జిల్లా అధ్యక్షుడిగా సురేష్

image

TRTF జిల్లా అధ్యక్షుడిగా తుంగూరు సురేష్, ప్రధాన కార్యదర్శిగా గుర్రం శ్రీనివాస్‌గౌడ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ ప్రకటించారు. జగిత్యాలలో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వీరితో పాటు 10 మంది రాష్ట్ర కౌన్సిలర్లు, 6 గురు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు,10మంది ఉపాధ్యకులు, 6గురు అదనపు ప్రధాన కార్యదర్శులు, 10మంది కార్యదర్శులను ఎన్నుకున్నారు.

News November 23, 2025

ముత్తుసామి సూపర్ సెంచరీ

image

రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ప్లేయర్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ముత్తుసామి(101*) క్రీజులో పాతుకుపోయి సెంచరీతో అదుర్స్ అనిపించారు. ఇది అతడికి తొలి టెస్ట్ సెంచరీ. మార్కో జాన్సన్(49*) సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. INDకు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇండియన్ బౌలర్లు విజృంభించి వికెట్లు తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం RSA స్కోర్ 418/7గా ఉంది.

News November 23, 2025

672 Sr రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎయిమ్స్ న్యూఢిల్లీ 672 Sr రెసిడెంట్/Sr డెమాన్‌స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 4వరకు అప్లై చేసుకోవచ్చు. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి MBBS, DNB/MD/MS/PhD/MSc ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. రాత పరీక్ష DEC 13న నిర్వహిస్తారు. వెబ్‌సైట్: www.aiimsexams.ac.in/