News August 8, 2025
US ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేత.. క్లారిటీ

అమెరికా నుంచి భారత్ ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేసిందన్న వార్తలను రక్షణ శాఖ ఖండించింది. ఆ వార్తలు అవాస్తవమని, అవి కేవలం కల్పితమంటూ కొట్టిపారేసింది. వివిధ కొనుగోళ్లు ప్రస్తుతం ఉన్న విధానాల ప్రకారం ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేసింది. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో కొనుగోళ్లు నిలిపివేశారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News August 8, 2025
ట్విటర్ టిల్లు సిగ్గు పడాలి: బండి సంజయ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KTR, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. KTR విసిరిన <<17344505>>సవాల్‌పై<<>> తాజాగా బండి ఘాటుగా స్పందించారు. ‘చట్టవిరుద్ధమైన పనులు చేసి లీగల్ నోటీసుల గురించి మాట్లాడటానికి ట్విటర్ టిల్లు సిగ్గుపడాలి. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని నీ సొంత సోదరే ఆరోపించారు. రాఖీ వేళ ఆమెను ఎదుర్కోలేక పారిపోతున్నావు. నాకు ఇచ్చిన 48 గంటల సమయంలో మరిన్ని నీ చీకటి రహస్యాలు బయటపెడతా’ అని హెచ్చరించారు.
News August 8, 2025
రానున్న 2గంటల్లో వర్షం

TG: హైదరాబాద్‌లో రానున్న 2 గంటల్లో వర్షం పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్బీ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, చార్మినార్, మలక్ పేట్, మెహదీపట్నం, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షాలకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు తదితర జిల్లాల్లోనూ వర్షాలకు ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
News August 8, 2025
హైకోర్టులో నలుగురు అదనపు జడ్జిలకు ప్రమోషన్లు

AP: హైకోర్టులో నలుగురు అదనపు జడ్జిలకు పదోన్నతి కల్పిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ హరనాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లకు పూర్తిస్థాయి జడ్జిలుగా ప్రమోషన్ దక్కింది. వీరి పదోన్నతి కోసం సుప్రీం కోర్టు కొలీజియం ఇటీవల చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.