News December 20, 2024

అమెరికా పౌరసత్వం: రెండో స్థానం మనోళ్లదే

image

అమెరికా పౌర‌స‌త్వం తీసుకుంటున్న భార‌తీయుల సంఖ్య పెరుగుతోంది. FY 2024లో అమెరికా పౌర‌స‌త్వం పొందిన వివిధ దేశీయుల్లో భార‌తీయులు రెండో స్థానంలో నిలిచారు. US Citizenship and Immigration Services లెక్క‌ల‌ ప్రకారం గత ఏడాది 49,700 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు. తద్వారా కొత్తగా పౌర‌స‌త్వం పొందిన వారిలో 6.1% వాటా భార‌తీయుల‌దే కావ‌డం గ‌మ‌నార్హం. అత్య‌ధికంగా మెక్సికో 13.1% వాటాతో జాబితాలో ముందుంది.

Similar News

News November 20, 2025

ఒంగోలు మాజీ MP హత్యలో అతనే సూత్రధారి.?

image

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఎన్కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సుమారు 37ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న టెక్ శంకర్ పలు మావోయిస్ట్ ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. అందులో 1995 డిసెంబర్ 1న ఒంగోలు మాజీ MP మాగుంట సుబ్బరామిరెడ్డిపై మావోయిస్టులు జరిపిన కాల్పుల కేసులో సైతం టెక్ శంకర్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

News November 20, 2025

బాబు లుక్స్ అదిరిపోయాయిగా..

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘వారణాసి’ మూవీ కోసం హైదరాబాద్‌లో హాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. బాబు కోసం హాలీవుడ్ HYDకు వచ్చిందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఆయన లుక్స్ అదిరిపోయాయని, మూవీ విడుదలయ్యే వరకు ఇలా ఫొటోల్లో కనిపించినా చాలని మరికొందరు అంటున్నారు.

News November 20, 2025

ఆవుల డెయిరీ, గేదెల డెయిరీ.. దేనితో లాభం?

image

స్థానికంగా ఆవు, గేదె పాలకు ఉన్న డిమాండ్ బట్టి ఫామ్ ప్రారంభించాలి. గేదె పాలకు అధిక ధర వస్తున్నా, స్థానిక గేదెలు తక్కువ పాలివ్వడం, అధిక పాలిచ్చే ముర్రాజాతి గేదెల ధర ఎక్కువ కావడం, సకాలంలో ఎదకు రాకపోవడంతో చాలా మంది నష్టపోతున్నారు. అందుకే ఏడాదిలో 280-300 రోజుల పాటు అధిక పాల దిగుబడినిచ్చే జెర్సీ, హోలిస్టిన్ ఫ్రీజియన్ ఆవులతో ఫామ్ నడపడం మేలంటున్నారు నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.