News October 25, 2024
US ELECTIONS: డొనాల్డ్ ట్రంప్‌నకు అచ్చొస్తున్న ‘లేడీ సెంటిమెంటు’

వరల్డ్ పోలీసుగా ఫీలయ్యే USలో రేసిజం, జెండర్ వివక్ష ఎక్కువే. ఎంత అభివృద్ధి చెందినా అక్కడ లేడీ ప్రెసిడెంట్‌ను ఎన్నుకున్న దాఖలాలు లేనేలేవు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు ఈ సెంటిమెంటు అచ్చొచ్చేలా ఉంది. 2016 ఎన్నికల్లో ఆయన హిల్లరీ క్లింటన్‌ను ఓడించి షాకిచ్చారు. 2020లో జోబైడెన్ చేతిలో ఓడారు. 2024లో మళ్లీ మహిళా అభ్యర్థి కమలా హారిస్‌పై పోటీచేస్తున్నారు. మరి సెంటిమెంటు వర్కౌట్ అవుతుందంటారా?
Similar News
News March 17, 2025
డీలిమిటేషన్‌పై అఖిల పక్ష సమావేశం

TG: డీలిమిటేషన్ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ అంశంపై ఇలాంటి సమావేశాలు ఇంకా కొనసాగుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. డీలిమిటేషన్‌పై తమిళనాడులో జరిగే సమావేశానికి రాష్ట్ర ప్రతినిధుల బృందం వెళ్తుందని, ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు హాజరవుతారని చెప్పారు.
News March 17, 2025
CM చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

AP: క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా MLC నాగబాబుకు మంత్రి పదవిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీని ఆహ్వానించే అంశంతో పాటు పలు కీలక అంశాలపై కూడా వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News March 17, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 28 వరకు ఆయనకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వంశీని కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అంగీకరించింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 19కు వాయిదా వేసింది.