News November 5, 2024
US Elections: డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం
న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్‌లో పోలింగ్ ముగిసింది. తొలి ఫలితం కూడా వచ్చేసింది. అర్హులైన ఓటర్లు అతితక్కువగా ఉండే ఈ ప్రాంతంలో 1960 నుంచి మిగిలిన రాష్ట్రాల కంటే ముందే పోలింగ్ జరుగుతోంది. ఈ ఫలితాల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌నకు చెరో మూడు చొప్పున బ్యాలెట్ ఓట్లు దక్కాయి. యూఎస్-కెనడా సరిహద్దులోని ఈ పట్టణ ప్రజలు గత రెండు అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చారు.
Similar News
News December 27, 2024
తినడానికి తిండిలేక మన్మోహన్ పస్తులు
ఎన్నో హోదాల్లో పనిచేసిన మన్మోహన్ ఒకప్పుడు తిండికి కూడా ఇబ్బందులు పడ్డారని ఆయన కూతురు దమన్ సింగ్ ఓ పుస్తకంలో ప్రస్తావించారు. ‘కేంబ్రిడ్జ్ వర్సిటీలో ట్యూషన్ ఫీజు, ఖర్చులు కలిపి ఏడాదికి 600పౌండ్లు అయ్యేది. పంజాబ్ వర్సిటీ 160పౌండ్లు ఇస్తుండేది. తాత డబ్బు సర్దుబాటు కాక పంపడం ఆలస్యమయ్యేది. దీంతో నాన్న కొన్నిసార్లు పస్తులు ఉండేవారు. డబ్బును పొదుపుగా వాడుతూ చాక్లెట్‌తో కడుపు నింపుకునేవారు’ అని తెలిపారు.
News December 27, 2024
భారత్‌పై స్మిత్ రికార్డు
టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ చేశారు. 167 బంతుల్లో శతకం చేశారు. ఈ సిరీస్‌లో ఆయనకిది రెండో సెంచరీ. మొత్తంగా భారత్‌పై 11వది. దీంతో టీమ్ ఇండియాపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కారు. టెస్టుల్లో 34 సెంచరీల మార్కును అందుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 394/6గా ఉంది.
News December 27, 2024
మన్మోహన్ అరుదైన ఫొటోలు.. గ్యాలరీ
మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్(92) తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. మన్మోహన్ అరుదైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.