News November 5, 2024
నేడే US ఎలక్షన్స్.. మేజిక్ ఫిగర్ ఎంతంటే?

అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అందులో 270 ఓట్లు సాధించినవారు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. ‘విన్నర్ టేక్స్ ఆల్’ విధానం ప్రకారం ఒక రాష్ట్రంలోని మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థి పార్టీకే అక్కడి మొత్తం ఓట్లు లభిస్తాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ట్రంప్, కమల మెజార్టీ దక్కించుకోవడం ఖాయంగా మారింది. అయితే స్వింగ్ స్టేట్స్(అటూ, ఇటుగా ఉండే)గా పిలవబడే రాష్ట్రాలే అధ్యక్షుడిని డిసైడ్ చేయనున్నాయి.
Similar News
News February 20, 2026
బెంగాల్ SIR పర్యవేక్షణకు ప్రత్యేక బృందం

బెంగాల్‌లో కొనసాగుతున్న SIRను పర్యవేక్షించేందుకు ప్రస్తుత లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ మాజీ జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ జుడీషియల్ ఆఫీసర్ల నియామక బాధ్యతలను కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు అప్పగించింది. బెంగాల్ ప్రభుత్వం, భారత ఎన్నికల కమిషన్ మధ్య ట్రస్ట్ గ్యాప్ ఏర్పడిందని, దీంతో ఈ ప్రక్రియ సజావుగా సాగించేందుకు ఇదొక్కటే ప్రత్యామ్నాయమని ధర్మాసనం అభిప్రాయపడింది.
News February 20, 2026
ఎనిమిదేళ్లకే ఇంత టాలెంటా!

రణవీర్ సచ్‌దేవా(8) అద్భుతాలు సృష్టిస్తున్నాడు. 4 ఏళ్లకే నాసా వెబ్‌సైట్‌లో చోటు సంపాదించిన ఈ బుడతడు.. 5 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన ‘యాపిల్ ప్రోగ్రామర్’గా గుర్తింపు పొందాడు. 6 ఏళ్లకే ‘టెడెక్స్’ స్పీకర్‌గా రికార్డు సృష్టించాడు. పర్యావరణంపై తనకున్న అవగాహనతో ‘గ్రీన్ యోధా’గా నిలిచాడు. తాజాగా ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ సమ్మిట్’లో కీనోట్ స్పీకర్‌గా ప్రపంచ నాయకుల దృష్టిని ఆకర్షించాడు.
News February 20, 2026
USతో ట్రేడ్ డీల్.. ఏప్రిల్ నుంచి అమల్లోకి: పీయూష్ గోయల్

IND-US ట్రేడ్ డీల్‌పై మార్చిలో సంతకాలు జరుగుతాయని, APR నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. FEB 23 నుంచి 25 వరకు 2 దేశాల అధికారులు వాషింగ్టన్‌లో సమావేశమై డీల్ తొలి దశకు ఆమోదం తెలుపుతారన్నారు. ఢిల్లీలో జరిగిన AI సమ్మిట్‌లో ఆయన US రాయబారి సెర్గియోతో సమావేశమయ్యారు. UK, ఒమన్‌తో డీల్స్ APR నుంచి, న్యూజిలాండ్‌తో ఒప్పందం SEPలో అమల్లోకి రావొచ్చని గోయల్ పేర్కొన్నారు.


