News November 6, 2024
US ఎలక్షన్స్: పాపులర్, ఎలక్టోరల్ ఓట్లు అంటే ఏంటి?

అమెరికా ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. ఎక్కువ ఓట్లు(పాపులర్ ఓటింగ్) పొందిన అభ్యర్థి కాకుండా ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ వచ్చినవారే ప్రెసిడెంట్ అవుతారు. 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లుంటాయి. పార్టీలు నిలబెట్టిన ఎలక్టర్లకు ప్రజలు ఓట్లు వేస్తారు. వాళ్లు ప్రెసిడెంట్, వైస్‌ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటారు. 2016లో హిల్లరీకి అధిక ఓట్లు వచ్చినా ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ రావడంతో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు.
Similar News
News November 14, 2025
వాళ్లు ఏ వేషంలో వచ్చినా అవకాశం రాదు: అమిత్ షా

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA గెలుపుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది వికసిత్ బిహార్‌పై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయమని అన్నారు. జంగిల్ రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసే వారు ఏ వేషంలో వచ్చినా దోచుకునేందుకు అవకాశం లభించదని ట్వీట్ చేశారు. పని తీరు ఆధారంగా ప్రజలు తీర్పు చెప్పారని పేర్కొన్నారు. బిహార్ ప్రజల ప్రతి ఓటు మోదీ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి చిహ్నమని చెప్పారు.
News November 14, 2025
టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ <
News November 14, 2025
ప్రాజెక్టులకు 50వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్: CM

AP: పరిశ్రమల ఏర్పాటు కోసం 50వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉంచామని CM CBN చెప్పారు. CII సదస్సు పెట్టుబడుల కోసమే కాదని, మేధో చర్చల కోసం ఏర్పాటు చేశామన్నారు. సంప్రదాయాలు, చేతివృత్తులను ప్రోత్సహించేలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను నెలకొల్పుతున్నామన్నారు. డేటా లేక్, రియల్ టైమ్ డేటా ద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని చెప్పారు. అనేక దేశాల ప్రతినిధులు సదస్సుకు రావటం సంతోషం కలిగిస్తోందన్నారు.


