News November 10, 2024
US: కమలకు OpenAI ప్రచారం చేసిందా?

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు OpenAI ప్రచారం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ట్రంప్‌కు ఓటేసేలా నన్ను ఒప్పించు’ అని అడిగితే ‘అందుకు నేను సహకరించలేను’ అని బదులిచ్చింది. అదే ‘కమలకు ఓటేసేలా నన్ను ఒప్పించు’ అని అడిగితే మాత్రం ఆమెను గెలిపించాలని పలు కారణాలు చెప్పింది. దీంతో OpenAIపై విచారణ జరిపించాలనే డిమాండ్ మొదలైంది.
Similar News
News September 15, 2025
ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా?

సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ‘ఇండియా పోస్ట్’ పేరిట ఫేక్ మెసేజులు పంపుతున్నారు. ‘మీ పార్సిల్ వేర్ హౌస్‌కి చేరుకుంది. అడ్రస్ సరిగ్గా లేకపోవడంతో డెలివరీ కుదర్లేదు. ఈ లింక్ ఓపెన్ చేసి 48 గంటల్లోగా అడ్రస్ అప్‌డేట్ చేయండి. లేదంటే పార్సిల్ రిటన్ వెళ్లిపోతుంది’ అని మెసేజ్‌లు పంపుతున్నారు. అవన్నీ ఫేక్ అని PIB FACT CHECK తేల్చింది. మీ వాళ్లకి ఈ విషయం షేర్ చేయండి.
News September 15, 2025
చలికాలం మరింత చల్లగా ఉండనుంది: నిపుణులు

అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లా నినా వల్ల చలి తీవ్రంగా ఉంటుంది అంటున్నారు. ఎల్ నినో దక్షిణ ఆసిలేషన్ సైకిల్‌లో శీతల దశైన లా నినా.. భూమధ్య రేఖ పసిఫిక్‌లో సముద్ర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది అంటున్నారు. దాంతో వాతావరణంపై ప్రభావం ఉండనుంది. భారత్‌లో గతంలో కంటే చలి అధికంగా ఉంటుందని చెబుతున్నారు. తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News September 15, 2025
‘మిరాయ్’ మూవీని వదులుకున్న నాని!

తేజా సజ్జ హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’ మూవీని తొలుత నేచురల్ స్టార్ నానికి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని వినిపించారని తెలుస్తోంది. ‘కథ విన్న వెంటనే నాని ఒప్పుకున్నారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో విభేదాలు రావడంతో ఆయన ఈ మూవీని వదులుకున్నారు’ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత తేజాకు ఈ కథ చెప్పగా.. వెంటనే ఒప్పేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది.